(Local) Wed, 24 Jul, 2019

బాలీవుడ్ నటుడిపై హైదరాబాద్ లో చీటింగ్ కేస్!

July 04, 2019,   11:38 AM IST
Share on:

వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి, తద్వారా కావల్సినంత శక్తి అందించడమే కాకుండా, ఆరోగ్యంగా, అందంగానూ ఉంటామని ప్రతి ఒక్కరు నమ్ముతారు. సామాన్య జనాలతో పాటు సెలెబ్రిటీస్ వరకు ఎవరిని కదిలించిన ఫిట్ నెస్ మాట ఖచ్చింతంగా వినిపిస్తుంది. ఈ కోవలోనే రకరకాల ఫిట్ నెస్ సెంటర్లు నెలకొంటున్నాయి. అంతేకాక కొన్ని ఫిట్ నెస్ సెంటర్స్ ని సెలెబ్రిటీస్ రన్ చేయడమే కాకుండా మరికొన్ని వాటికీ వారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. అలాంటి ఒక ఫిట్ నెస్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ అయినా కారణంగా బాలీవుడ్ సెలెబ్రిటీ పైన కేసు నమోదు అయింది.

వివరాల్లోకి వెళితే... కేపీహెచ్‌బీకాలనీ మూడో ఫేజ్‌లో కల్ట్‌ ఫిట్‌నెట్‌ సెంటర్‌ కొనసాగుతోంది. దీనికి ముకేష్‌ బాంచల్‌ డైరెక్టర్‌గా, అంకిత్‌ సీఈవోగా, సుబ్రమణ్యం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బరువు తగ్గడానికి ఏడాదికి రూ.17,490 నుంచి రూ.36,400 వరకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. ఈ సంస్థకు బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటంతో చాలా మంది సభ్యత్వం తీసుకున్నారు. అయితే పరిమితికి మించి అభ్యర్థులను నమోదు చేసుకోవడంతో వారికి కేటాయించిన సమయాల స్లాట్‌ బుక్‌ కావడం లేదు. దీంతో డబ్బులు చెల్లించిన అనేక మంది నిత్యం సిబ్బందిని స్లాట్‌ కోసం నిలదీస్తే సరియైన సమాధానం రావడం లేదు. దీంతో విసుగు చెందిన శశికాంత్‌ అనే బాధితుడు కేపీహెచ్‌బీకాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిమితికి మించి దరఖాస్తులు స్వీకరించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఎండీ, సీఈవో, మేనేజర్‌లతో పాటు ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న హృతిక్‌రోషన్‌ పై కూడా చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు నలుగురిపై 420, 406 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.