(Local) Wed, 22 Jan, 2020

హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..

November 29, 2019,   12:36 PM IST
Share on:
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..

టాలీవుడ్ ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై మూడు పల్టీలు ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే నటుడు రాజశేఖర్ రోడ్డుపై పరిమితికి మించిన వేగంతో వాహనం నడపడమే ఈ ఆక్సిడెంట్ కి కారణం...ఈ ప్రమాదంలో ఆయన కారులో సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీయే అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీయేకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ లేఖను పంపారు. ఓఆర్ఆర్‌పై ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుందని వారు గుర్తు చేశారు. కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సిఫార్సులపై ఆర్టీయే అధికారులు నిర్ణయం తీసుకోవాల్సివుంది. కనీసం ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధలను పలు మార్లు ఉల్లఘించిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2017లో కూడా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఒక వ్యక్తి కారుని తన కారుతో ఢీ కొట్టారు. ఆరోజు ఆయన తాగి డ్రైవ్ చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా.. ఆయన తాగలేదని తేలింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.