(Local) Mon, 27 Sep, 2021

'సైరా కోసం గుండు చేయించుకున్నాడు'

October 04, 2019,   6:12 PM IST
Share on:
'సైరా కోసం గుండు చేయించుకున్నాడు'

కొంత మంది నటీనటులు సినిమాను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తెర మీద మీద అలాంటి వాళ్ళనీ చూసినప్పుడు వాళ్ళు నటించరా లేక జీవించారా అనే సందేహం కూడా రక మానదు. మొత్తానికి కథ డిమాండ్ చేస్తే ఎంతటి ప్రయోగానికైనా, మార్పులు చేసుకునేందుకు సినీ నటులు సిద్దమవుతూనే ఉంటారు. టాలీవుడ్ లో బ్రహ్మాజీ నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. తాజాగా విడుదలై కల్కేక్షన్ల వర్షం కురిపిస్తున్న సైరా చిత్రంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అనుచరుడి పాత్రలో ఆయన నటన ప్రేక్షకులు మర్చిపోరు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. చిత్రం కోసం ఏకంగా గుండు చేయించుకున్న ఫొటో షేర్ చేశారు. అంతేకాదు, గుర్రపుస్వారీ కూడా నేర్చుకున్నాను.  సైరాలో ఏదైనా పాత్ర ఇవ్వమని రామ్‌చరణ్‌ను అడిగాను. కానీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇస్తాడనుకోలేదంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు సినిమా యూనిట్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ ఫొటోను షేర్‌ చేసుకున్నారు. 
 

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.