(Local) Mon, 12 Apr, 2021

రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు...

October 10, 2019,   5:59 PM IST
Share on:
రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు...

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఒకరిగా వెలుగొందుతున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ బ్యూటీ 2011లో కెరటం అనే చిన్న సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగుల అగ్రహీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ పంజాబీ భామ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోంది. రకుల్ అక్టోబర్ 10, 1990లో ఢిల్లీలో పుట్టింది.. మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది రకుల్. ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇటీవల మన్మధుడు నాగార్జునతో కలిసి మన్మధుడు 2 లో నటించింది. రకుల్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది.  ఎఫ్ 45 పేరుతో జిమ్ ను స్థాపించి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.  మనిషి ఫిట్ గా ఉంటేనే లైఫ్ లో ఏదైనా సాధించేందుకు అవకాశం ఉంటుంది అనే థీమ్ తో జిమ్ వ్యాపారంలోకి ప్రవేశించిన రకుల్ అక్కడ మంచి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం శంకర్, కమల్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 లో నటిస్తుంది . ఇలా సినిమాల్లోనూ వ్యాపార రంగంలోనూ దూసుకు పోతున్న బిజీగా వున్నా ఈ పుత్తడి బొమ్మకు మరో సారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.