(Local) Wed, 20 Oct, 2021

దీపావళికి పోటీ పడనున్న తమిళ్ స్టార్స్...

October 18, 2019,   6:12 PM IST
Share on:
దీపావళికి పోటీ పడనున్న తమిళ్ స్టార్స్...

పండగ వస్తోంది అంటే చాలు సినీ ఫాన్స్ కి సందడే. ఎందుకంటే తమ అభిమాన హీరో చిత్రం వస్తుండటం అనేది సహజంగా జరిగేదే. అయితే ప్రతి దీపావళికి ఎదో ఒక పెద్ద సినిమాలు ఉండేటట్టు చూసుకుంటున్నారు తమిళ మేకర్స్. ఈ దీపావళికి తమిళంలో రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. కాగా ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కార్తి కొత్త సినిమా `ఖైదీ` ఈ దీపావ‌ళికి విడుదల కానుంది. ఇక రెండవ చిత్రం స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్. ఈ సినిమా తెలుగులో `విజిల్‌` అనే పేరుతో రిలీజ్ అవుతుంది. యంగ్ డైరెక్టర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీపై త‌మిళ‌నాట భారీ అంచ‌నాలున్నాయి. మరి ఒకే రోజు వస్తున్నా ఈ రెండు సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అంతేకాక  ఈసారైనా తమిళ హీరోలకు తెలుగులో హిట్స్ దక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే.

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.