(Local) Fri, 23 Jul, 2021

తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పిన...ప్రముఖ యాంకర్

October 25, 2019,   5:52 PM IST
Share on:
తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పిన...ప్రముఖ యాంకర్

బుల్లితెరపై టీవీ సీరియల్స్ చూసేవారిని సైతం తమ వైపుకి తిప్పుకున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ 3 తుది దశకు చేరుకోవడానికి కొన్ని రూజులు మాత్రమే ఉంది. ఈ బిగ్ బాస్ సీజన్ లో హౌస్ మేట్స్ ఒకరైన యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్‌-3లో గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీముఖి తన ప్రేమకు సంబంధించిన విషయాలను బయటపెట్టేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌ టాస్క్‌లో భాగంగా మిగిలిన పోటీదారుల్లో ఒక్కొక్కరు తమ వ్యక్తిగత సీక్రెట్స్‌ను బయటపెట్టారు. ఈ క్రమంలోనే శ్రీముఖి తన లవ్‌బ్రేకప్‌ గురించి వెల్లడించింది. లవ్ ఫెయిల్యూర్ కావడంతో ఆ సమయంలో చనిపోదామన్న ఆలోచన కూడా తనకు వచ్చిందని శ్రీముఖి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే శ్రీముఖి ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడ బయటపెట్టలేదు. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. తనకు రిలేషన్‌షిప్ ఉందని, దానినేప్పుడూ బయటపెట్టలేదని తెలిపింది. అతడితో అంతా ఓకే అనుకున్న సమయంలోనే తమ రిలేషన్ పూర్తిగా దెబ్బతిందని చెప్పుకొచ్చింది. సెటిల్ కాకుండా లవ్వు గివ్వు అంటూ తిరిగితే ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అది తన జీవితంలో అగ్లీ బ్రేకప్ అని ఆమె పేర్కొంది.
 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.