(Local) Tue, 07 Apr, 2020

వాడి నవ్వుచూస్తుంటే మండిపోతోంది......పునర్నవి

August 27, 2019,   4:13 PM IST
Share on:
వాడి నవ్వుచూస్తుంటే మండిపోతోంది......పునర్నవి

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 షోలో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగడం మొదలయింది. ఇంతవరకూ హౌస్ మేట్స్ ఎక్కువమంది ఉండడం తో ఒకరికి ఒకరు తప్పించుకునేలా ఆటాడారు. ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే మిగలడంతో వీరిమధ్య అసలైన ఆట మొదలైంది. ఇక రాహులు పులిహోర పోపు ఘాటు ఎక్కువైంది. దాంతో పునర్నవి అతనితో గొడవ పడింది. భార్యా భర్తల మధ్యలోనూ ఎదో జరిగింది. అది నామినేషన్లలో ప్రతిఫలించింది.రాహుల్ పునర్నవి కోసం కలుపుతున్న పులిహోరలో సొంతడబ్బా ఘాటు ఎక్కువైంది. దీంతో పునర్నవి ఛీ పో.. అంది. విషయం ఏమిటంటే, సరదాగా ఇద్దరూ కూచుని మాట్లాడుకుంటుంటే.. రాహుల్ ఒక్కసారిగా పునర్నవి ఈగో మీద కొట్టాడు. తనతో వాదులాడుతోందనో కోపమో లేక వర్కౌట్ కావడం లేదనే బాధో తెలీదు కానీ, పునర్నవిని ఒక రేంజిలో మాటలతో ఆడుకున్నాడు. ''అసలు నువ్వేమనుకుంటున్నావ్? బయట నీలాంటోళ్లు బొచ్చాడు మంది ఉన్నారు. అసలు నువ్ నాకు ఏమి అవుతావ్ చెప్పు. నువ్ ఆఫ్ట్రాల్ ఫ్రెండ్‌వి మాత్రమే. నాకోసం కోసుకునే వాళ్లు ఉన్నారు'' అంటూ ఆమె ఈగోని దెబ్బకొట్టి షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె రాహుల్ తో మాట్లాడను అంటూ వెళ్ళిపోయింది. ఈ జంట మధ్య వచ్చిన సమస్యను హౌస్ లో మరోజంట వరుణ్, వితికలు సరిచేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకసారి వాడితో మాట్లాడు అని పునర్నవిని రాహుల్ దగ్గరకు తీసుకురావడంతో వాడితో నేను మాట్లాడేది ఏంటి? వాడి నవ్వుచూస్తుంటే మండిపోతుంది. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా, తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని లేదనీ, తనను పంపించేయమనీ బిగ్ బాస్ ను రిక్వస్ట్ చేసింది. 

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.