(Local) Fri, 25 Sep, 2020

బిగ్ బాస్ హౌస్ లో అవార్డుల కార్యక్రమం....శివజ్యోతి, వరుణ్ సేఫ్

August 18, 2019,   3:03 PM IST
Share on:
బిగ్ బాస్ హౌస్ లో అవార్డుల కార్యక్రమం....శివజ్యోతి ...

బుల్లితెరపై సీరియల్స్ చూసే వారికీ శని, ఆదివారాలలో బ్రేక్ ఉంటుందేమో కానీ, ఎటువంటి బ్రేక్ లేకుండా వారంరోజులపాటు  నిరంతరాయంగా  కొనసాగే షో బిగ్ బాస్. సాధారణంగా సోమవారం నుండి శుక్రవారం వరకు హౌస్ లోని సభ్యులతో కొనసాగే షో ఒక ఎత్తయితే శని, ఆదివారంలో మాత్రం హోస్ట్ నాగార్జునతో షో అంతకుమించి ఉంటోంది అని చెప్పొచ్చు. 'బిగ్ బాస్' నాలుగో వారంలో హోస్ట్ నాగార్జున ఈ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారు? అని చెప్పకముందే బిగ్ లీక్స్ బయటికి వచ్చేశాయి. ఈ వారం తక్కువ ఓటింగ్ తో 'రోహిణి' ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నాగార్జున వచ్చే వీకెండ్ షోలు (శనివారం నాడే షూటింగులు) జరగడంతో ఈ లీక్ లు బయటికి వస్తున్నాయి. స్టార్ యాజమాన్యం, షో నిర్వాహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ లీక్ లు ఆగడం లేదు. 
షోకి వచ్చే ప్రేక్షకులు కూడా రోహిణి ఎలిమినేట్ అయ్యారని చెబుతున్నారు. శ్రీముఖి ముందే ఊహించినట్లు రోహిణి ఎలిమినేట్ కావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో శ్రీముఖి చెబుతున్నట్లే హౌస్ లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో నాగార్జునకు వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్స్ పడుతున్నాయి. కావాలనే శ్రీముఖికి ఫేవర్ గా స్క్రిప్ట్ చెబుతున్నాడని బాబా భాస్కర్ తప్పులను ప్రేక్షకులకు చూపిస్తున్నాడని నాగార్జునపై కూడా నెటిజన్స్ సైటైర్స్ వేస్తున్నారు. 
అంతకు ముందు నాగార్జున మన టీవీలో షోలో జరిగిన ఎపిసోడ్ చూపించారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు ప్రొటెక్టర్‌, అటాకర్ టీంలుగా విడిపోయారు. ఈ టాస్క్ లో ప్రొటెక్టర్‌ టీం గెలిచింది. దీంతో  ప్రొటెక్టర్‌ టీం సభ్యులు అటాకర్ టీంసభ్యులను టీజ్ చేశారు. ఆ తరువాత నాగార్జున ఇంటి సభ్యులకు అవార్డులు ప్రధానం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమం నవ్వులు పూయించాయి.
ముందుగా బాబా భాస్కర్ మాస్టర్ కు నాగ్ ప్రెజర్ కుక్కర్ అవార్డు ఇచ్చారు. దీనికి కారణంగా ఆషూ తనను నామినేట్ చేసిన విషయాన్ని బాబా భాస్కర్ ఇంకా మనసులో ఉంచుకున్నందుకని నాగ్ చెప్పాడు. మంచి వాడు అనిపించుకోవాలనే వ్యాధి చాలా డేంజరని నాగ్.. బాబా భాస్కర్ కు హెచ్చరించాడు. ఆ తరువాత ఈ వారం హౌస్ నుండి రోహిణి ఎలిమినేట్ కానుందని శ్రీముఖి చెప్పడం తప్పని చెప్పిన నాగ్ ప్రతి వారం రాహుల్ ను ఎలిమినేట్ చేస్తూనే ఉంటా అని చెప్పడం రైట్ అని చెప్పారు.
శ్రీముఖి ఎప్పుడు అరుస్తూనే ఉంటుందని చెప్పిన నాగ్ ఆమెకు లౌడ్ స్పీకర్ అవార్డు నిచ్చారు. కోపం తగ్గించుకోవాలని అంపైరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు టాస్క్ లో పాల్గొనాలని పునర్నవికి నాగ్ సూచించారు. అందరి దగ్గర ఒకలా రాహుల్ దగ్గర ఒకలా పునర్నవి ఉంటుందని చెప్పిన నాగ్ ఆమెకు అంపైర్‌ అవార్డును ప్రకటించారు.
శ్రీముఖిని ఉద్దేశించి 'ఫాల్తూది' అని రాహుల్ అనడం ఆ విషయంలో నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పటికే శ్రీముఖికి రాహుల్ క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. సారీ చెప్పిన తరువాత కూడా వెనకాల మాట్లాడటం సరికాదని నాగ్..రాహుల్ ను హెచ్చరించాడు. ఆ తరువాత ఇంటి సభ్యులకు నాగ్ వరుసగా అవార్డులు ప్రకటించాడు.టాస్క్ లో పెద్దగా పాల్గొనకుండా ఉండే ఆషూకు ఆటలో అరటి పండు అవార్డు దక్కింది. 
కత్తెర అవార్డు రోహిణికి ఇచ్చిన నాగార్జున పుల్లలుపెట్టే అవార్డును మహేష్‌ విత్తాకు ప్రకటించారు. ప్రతి విషయాన్ని సీరియస్ గా చూసే అలవాటు ఉన్నా వితికకు భూతద్దం అవార్డును ఆమె భర్త వరుణ్ సందేశ్ కు ఫైనాపిల్ అవార్డు ఇచ్చారు. సెన్సిబుల్, షార్ట్ టెంపర్ 'హిమజ'కి చిచ్చుబుడ్డి అవార్డు ఇచ్చిన నాగార్జున నిరంతరం ఏడుస్తుందని శివజ్యోతికి ఆనియన్ అవార్డు ప్రకటించారు. మంచి ఫ్రెండ్స్ రవికృష్ణ, అలీ రెజాలకు నాగ్ వరుసగా పెద్ద చెవి, ఫ్లూట్ అవార్డులు ప్రకటించారు. చివరగా ఎలిమినేషన్ అని చెప్పి నాగ్ ఇంటి సభ్యులను నవ్వుల మూడ్ నుండి సీరియస్ మూడ్ లోకి తీసుకువచ్చారు. 
ఈ వారం 7 మంది ఎలిమినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి,  శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌ లు ఎలిమినేషన్ లో ఉన్నారు. అందరిని టెన్సన్ పెడుతూ నాగ్ మొదటగా శివజ్యోతి సేఫ్ అయినట్లు ప్రకటించారు. 
 ఆ తరువాత వరుణ్ సందేశ్ ను నాగ్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే అంటూ మిగిలిన ఐదు మంది సభ్యులను ప్రేక్షకులను టెన్షన్ పెడుతూ శనివారం షోకి బాయ్ చెప్పేశారు.  బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణిలోంచి ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే. మరి నిజంగానే రోహిణి ఎలిమినేట్‌ అయిందా? లేదా బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ చేసి రాహుల్ ను కూడా ఎలిమినేట్ చేశారా? అనే విషయం తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్‌ చూడాల్సిందే...!

సంబంధిత వర్గం
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.