(Local) Thu, 09 Apr, 2020

బిగ్‌బాస్ హౌస్‌లో 'సుమ' ..

October 28, 2019,   4:55 PM IST
Share on:
బిగ్‌బాస్ హౌస్‌లో 'సుమ' ..

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్...అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో చివరిదశకు చేరబోతున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక వారం రోజుల్లో షో ముగియనుండడంతో హౌస్ లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఓ యాంకర్ వచ్చినట్టు ప్రోమో విడుదల చేసారు....తను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే. పిల్లోడి నుంచి ముసలోళ్లదాకా ఆమె పేరు తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర నుంచి సినీ పరిశ్రమ దాకా అందరికీ ఆమె సుపరిచితురాలే. క్యాలెండర్లు మారుతున్నా ఆమె స్థానం మాత్రం సుస్థిరంగా కొనసాగుతోంది. ప్రముఖ యాంకర్‌.. సుమ కనకాల. వారం రోజుల్లో షోకు శుభం కార్డు పడనుండటంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సుమను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ ఫన్నీ టాస్క్‌లు చేయిస్తోంది. తన పంచ్‌లతో ఒక్కొక్కరినీ రఫ్ఫాడిస్తోంది. సుమ ఎంట్రీ వల్ల ఇంట్లో సంతోషాల సరదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. మరి టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఆటపాటలతో అలరించే సుమ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకా ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.