(Local) Wed, 18 Sep, 2019

సీక్రెట్ టాస్క్ లో రచ్చ చేయాలనుకున్న...ఓడిపోయిన హిమజ

August 24, 2019,   3:19 PM IST
Views: 51
Share on:
సీక్రెట్ టాస్క్ లో రచ్చ చేయాలనుకున్న...ఓడిపోయిన హి ...

నాగార్జున వ్యాక్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రోజుకొక రసవత్తర ఘట్టం బుల్లితెరమీదకి కనిపిస్తోంది. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో చాల వరకు ఆనందంగానే నడిచింది. అయితే బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకి నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ముందుగానే చెప్పేస్తున్నారు. నిన్న బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వకముందు స్టార్ మా ఒక ప్రోమో విడుదల చేసింది. అందులో హిమజ గొడవ చేయడం.. కిచెన్‌లో ఎగ్స్‌ పగలగొట్టడంతో ప్రోమో విపరీతంగా వైరల్‌ అయింది. అయితే అది సీక్రెట్‌ టాస్క్‌ అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.  అందరూ  అనుకున్నట్లే అది సీక్రెట్‌ టాస్కే అని తేలిపోయింది. ఈ టాస్క్‌లో భాగంగా..హిమజ ఇంట్లోని కొన్ని వస్తువులను దొంగతనం చేయడం.. కిచెన్‌లో గొడవలు సృష్టించడం.. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ను పూర్తి కానివ్వకుండా అడ్డుకోవడం లాంటివి చేయాలని ఆదేశించాడు.

అయితే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ విజయవంతం చేసి ఇమ్యునైజేషన్ కొట్టేద్దామని హిమజ ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయింది.  సీక్రెట్ టాస్క్ లో భాగంగా హిమజకు బిగ్ బాస్ చెప్పినట్లు కిచెన్ ఆమ్లెట్ వేసుకుని తింటుండగా బాబా మాస్టర్ ఇది సీక్రెట్ టాస్క్ ఏమో అనగానే హిమజ తింటున్న ఆమ్లెట్ తీసుకెళ్లి డస్ట్ బిన్ వేసేసింది కోపం నటిస్తూ. కిచెన్ పాడుచేయాలి కాబట్టి అందులో భాగంగా కోపం ఎక్కువయినట్టు నటిస్తూ ఒక్కసారిగా రెచ్చిపోయి.. కిచెన్ లో గుడ్లు అన్ని పగలగొట్టి నేను తినలేదు కాబట్టి మీరెవరు తినడానికి వీలు లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. దీని గురించి ఇంట్లో వాళ్ళందరూ కాసేపు హిమజాని అరవడం, ప్రశ్నించడం జరిగింది. అలీ ప్రోటీన్ డబ్బా దాచిపెట్టి అలీ తో కాసేపు వాదులాట ఆడింది.  దీంతో ఈ ఓవర్ యాక్షన్ ని రవికృష్ణ, అలీ పసిగట్టారు. ఆమెను అడ్డుకుంటూ గేమ్ ఆడారు. బాబా భాస్కర్ తొ శ్రీముఖి హిమజ సీక్రెట్ టాస్క్ లో ఉంది మీరు కోపం తెచ్చుకోవద్దు అని సలహా ఇచ్చింది. అయితే, భాస్కర్ నేను ఎప్పుడూ కోపం తెచ్చుకోను అని సమాధానం ఇచ్చారు. మొత్తానికి అన్ని టాస్క్ లు కరెక్ట్ గా చేయగలిగిన హిమజ లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ను మాత్రం పూర్తీ అవ్వకుండా ఆపలేకపోయింది. దాంతో హిమజ సీక్రెట్ టాస్క్ ఓడిపోయింది.  

సంబంధిత వర్గం
తొమ్మిదో వారంలో నామినేషన్‌లో ఉంది వీరే....
తొమ్మిదో వారంలో నామినేషన్‌లో ఉంది వీరే....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.