(Local) Wed, 21 Aug, 2019

మూడవ వారం ఎలిమినేట్ అయిన తమన్నా...బిగ్ బాస్ 3

August 12, 2019,   1:44 PM IST
Share on:

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 శనివారం నాటి 21వ ఎపిసోడ్‌ పూర్తీ చేసుకుంది. అయితే శనివారం మాత్రం షో కొంచం సీరియస్ గా సాగింది. ముందు ఎపిపోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు  "దొంగలున్నారు జాగ్రత్త" అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ రవికృష్ణ చేతికి గాయం అవ్వడం, హిమజ ని అలీ గట్టిగ గట్టిగ అరవడం లాంటివి జరగడంతో శనివారం నాడు నాగార్జున హౌస్‌మేట్స్‌కి క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్, తమన్నా, అలీలకు క్లాస్ పీకిన నాగార్జు... హౌజ్‌లో హద్దులు దాటుతున్న కంటెస్టెంట్లకు ఛీవాట్లు పెట్టారు. అయితే, ఆదివారం మాత్రం షో చాలా సరదాగా నడిచింది. బిగ్ బాస్ షో 15 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమై ఇప్ప‌టికే రెండు ఎలిమినేష‌న్స్ పూర్తిచేసుకుంది. తొలి వారం హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌గా, రెండో వారం జాఫ‌ర్‌ని ఎలిమినేట్ చేశారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 14 మంది స‌భ్యులు ఉండ‌గా… ఈ వారం నామినేష‌న్‌లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌లో నిలిచారు. రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్‌లో ఉన్న పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షెరు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోగా తమన్నా ఎలిమినేట్ అయింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున తమన్నా పేరు చదవగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన కన్నీళ్లు బాబా భాస్కర్ కోసమేనని, ఆయన లాంటి తండ్రి తనకు ఉంటే బాగుండునని పేర్కొంది. బిగ్‌బాస్ షోకి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. షోకి రావాలన్న తన కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. బాబా భాస్కర్‌కు తాను కూతురిని అయి ఉంటే సూపర్ లేడీని అయి ఉండేదాన్నని కన్నీళ్లు పెట్టుకుంది. కాగా షో మధ్యలో నటుడు వెన్నెల కిశోర్ సందడి చేశాడు. మన్మథుడు-2 ట్రైలర్ ప్రమోషన్‌లో భాగంగా షోకి వచ్చిన వెన్నెల కిశోర్ హౌస్‌మేట్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు.

సంబంధిత వర్గం

బాబా మాస్టర్ ని ఏడిపించిన.....అలీ
సర్వర్‌గా మరీనా వరుణ్ సందేశ్‌....ఇంటి స‌భ్యుల‌పై బ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.