(Local) Mon, 23 Sep, 2019

బిగ్ బాస్ హౌస్ లో ‘జిగేల్‌’ అనిపించినా డాన్స్ పెరఫామెన్స్....

August 22, 2019,   6:21 PM IST
Views: 218
Share on:
బిగ్ బాస్ హౌస్ లో ‘జిగేల్‌’ అనిపించినా డాన్స్ పెరఫ ...

బిగ్ బాస్ షో ప్రారంభం అవుతోంది అంటేనే వివాదాలకు సిద్ధం అని...పోనీ బిగ్ బాస్ హౌస్ లో ఉండేవారైనా సైలెంట్ గా ఉంటారా అంటే అది అస్సలే కుదరదు... డి అంటే డి అంటూ ఫైటింగ్స్ చేస్తారు, డాన్సులు చేస్తారు, టాస్క్ కూడా చేస్తారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ బుధవారం నాడు బిగ్ బాస్ ఇచ్చిన టాలెంట్ షో టాస్క్ వల్ల ఆ ఎపిసోడ్ ఆనందంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్‌లో తమ టాలెంట్‌ను ప్రదర్శించారు బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌. డ్యాన్సులు, సింగింగ్‌, యాక్టింగ్‌తో తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా పునర్నవి, అషూలు వేసిన స్టెప్పులు వైరల్‌ అవుతుండగా.. రాహుల్‌ పాట, అలీరెజా వేసన స్టెప్పులు, రవికృష్ణ గెటప్‌ హైలెట్‌ కాగా.. శివజ్యోతి మ్యాజిక్‌ అంటూ చేసిన పని సోషల్‌ మీడియాలో ఫన్‌ క్రియేట్‌ చేశాయి. టాలెంట్‌ షో పేరిట ఓ టాస్క్‌ను కార్యక్రమానికి బాబా, శ్రీముఖిలను న్యాయనిర్ణేతలుగా వ్యవహరించాలని తెలిపాడు. ఇక ఈ టాలెంట్‌ షోలో హౌస్‌మేట్స్‌ అందరూ తమ ప్రతిభను ప్రేక్షకులకు చూపించారు. నా పేరు సూర్య చిత్రంలోని ఇరగ ఇరగ అనే పాటకు పునర్నవి వేసిన ప్టెప్పులు అదిరిపోయాయి. హౌస్‌లో ఎప్పుడూ మూడీగా ఉంటూ.. టాస్క్‌లో పార్టిసిపేట్‌ చేయకుండా ఉండే పున్నరవి.. ఈ టాస్క్‌లో చేసిన పర్ఫామెన్స్‌తో అందరి నోళ్లు మూయించింది. ప్రస్తుతం ఆమె వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఇంతవరకు షోలో ఎక్కువగా హైలెట్‌ కానీ అషూ సైతం తన క్యూట్‌ స్టెప్పులతో అందర్నీ మెప్పించింది. రంగస్థలంలోని జిగ్‌లే రాణి పాటకు డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. తనకు డ్యాన్స్‌ రాదని, చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు కూడా డ్యాన్స్‌ అంటే తల్లిదండ్రులు కూడా వద్దనే వారని, రాకపోయినా.. ప్రయత్నిస్తున్నానని తన గురించి చెప్పుకున్న అషూ.. తన స్టెప్పులతో అదరగొట్టింది. మ్యాజిక్‌, లాజిక్‌ అంటూ శివజ్యోతి చేసిన పని.. అందరికీ నవ్వును తెప్పించింది. అగ్గిపెట్టెలో పట్టే చీర అంటూ అగ్గిపెట్టెలో చీరను దూర్చింది. దీంతో హౌస్‌మేట్స్‌ పగలబడి నవ్వారు. 

సంబంధిత వర్గం
మహేష్ పై బిగ్ బాంబు వేసిన హిమజ....
మహేష్ పై బిగ్ బాంబు వేసిన హిమజ....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.