(Local) Mon, 23 Sep, 2019

పంతం నీదా...నాదా లో గెలిచిన శివ‌జ్యోతి....

August 21, 2019,   3:22 PM IST
Views: 148
Share on:
పంతం నీదా...నాదా లో గెలిచిన శివ‌జ్యోతి....

తెలుగు బిగ్ బాస్ ప్రారంభమైన మొదట్లో కొంచం బోర్ గా అనిపించినా రాను రాను షో మంచి రసవత్తరంగా సాగుతోంది. సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు ఎలా వాదించుకున్నారో చూసాం. అలీ ఇంటి కెప్టెన్ అవ్వడంతో బిగ్ బాస్ ఆదేశం మేరకు బాబా భాస్కర్ ని డైరెక్ట్ నామినెటే చేసారు. అలీ బాబా ను నామినెటే చేసినందుకు ఆయన బాగా ఎమోషనల్ అయిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు బిగ్ బాస్ కెప్టెన్ అయ్యే అవకాశం లేడీస్ కి ఇస్తున్నట్టుగా చెప్పడంతో హౌస్ ఉన్న మ‌హిళ‌ల‌లు అందరు ఆనందించారు. బ‌జ‌ర్ మోగ‌గానే ఎవ‌రైతే ముందు వెళ్లి కన్ఫెష‌న్ రూంలో ఉన్న సీట్లో కూర్చొంటారో వారికి కెప్టెన్ టాస్క్ ఆడే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని చెప్పుకొచ్చారు. 

బ‌జ‌ర్ మోగ‌గానే ముందుగా క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్ళి కూర్చున్న వితికా, శివజ్యోతి కెప్టెన్ టాస్క్‌లో పాల్గొన్నారు. పంతం నీదా...నాదా లో ఎవరు గెలుస్తారో వారినే ఈ వారం కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పడంతో శివ జ్యోతి, వితిక ఇద్దరు కెప్టెన్ టాస్క్ కి సిద్ధం అవుతారు. బిగ్ బాస్ వారిద్దరిని క్రేన్‌ సాయంతో స్విమ్మింగ్ ఫూల్ పై నుండి గాల్లోకి లేపి.. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న వాట‌ర్ ట‌చ్ కాకుండా తోటి స‌భ్యులు వారిని అలానే గాలిలో ఉండేలా తాడు ప‌ట్టుకోవాలి. ఎవ‌రు ఎక్కువ సేపు గాలిలో ఉంటారో వారే విజేత‌లు అని బిగ్ బాస్ తెలిపారు. టాస్క్ మొద‌లైన త‌ర్వాత శివ‌జ్యోతి, వితికాలు గాల్లో ఉండేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఒకానొక స‌మ‌యంలో ప‌ట్టు కోల్పోయిన వితికా త‌ను కింద‌కి దిగేందుకు సిద్ధ‌మైంది. దీంతో శివ‌జ్యోతిని ఈ వారం కెప్టెన్‌గా ఎంపిక చేశారు బిగ్ బాస్‌. త‌న‌కి స‌పోర్ట్ చేసిన అలీ, శ్రీముఖి, రవికి శివ‌జ్యోతి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 

మొత్తానికి ఇంటి కెప్టెన్‌గా ఓ మ‌హిళ‌ ఎంపిక కాగా, ఆమె ఇంటిని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఇంటి వాతావర‌ణంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి. ఇక నేటి ఎపిసోడ్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఆటలు, పాట‌ల‌తో ఇంటి స‌భ్యులు ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తార‌ని ప్రోమో ద్వారా తెలుస్తోంది .

సంబంధిత వర్గం
మహేష్ పై బిగ్ బాంబు వేసిన హిమజ....
మహేష్ పై బిగ్ బాంబు వేసిన హిమజ....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.