(Local) Tue, 18 May, 2021

బిగ్ బాస్ 3: గుడ్ల కోసం యాక్షన్ ఫీట్లు చేసిన కంటెస్టెంట్స్....!

August 14, 2019,   4:50 PM IST
Share on:
బిగ్ బాస్ 3: గుడ్ల కోసం యాక్షన్ ఫీట్లు చేసిన కంటెస ...

బిగ్ బాస్ ఎక్కడ చూసిన దీనిగురించే ప్రస్తావన.దాదాపుగా 7 బాషలలో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో నెక్స్ట్ ఎం జరగబోతోంది అనేదే వినిపిస్తోంది. తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ 3 కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి విదితమే. కాగా ముచ్చటగా మూడో వారం ముగించుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారంలో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. ఇది ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య బిగ్ బాస్ పెట్టిన టాస్క్ భలే గమ్మత్తుగా  కొనసాగింది. 

బిగ్ బాస్ హౌసేమ్యాట్స్ ని రెండు టీమ్స్‌గా విభజించి విక్రమ పురి, సింహపురి అని రెండు రాజ్యాలుగా పేర్లు పెట్టి గుడ్ల కోసం కొట్లాట పెట్టాడు. రెడ్ టీంకి శ్రీముఖి లీడర్‌గా, బ్లూ టీంకి హిమజ లీడర్‌గా వ్యవహరించారు. ఇక రెండు రాజ్యాలకు బ్లూ, రెడ్ జెండాలు ఇచ్చి ఏ రాజ్యంలో ఎక్కువ జెండాలు ఉంటే వాళ్లే విజేతలని.. ఇక గేమ్‌లో ఉన్న గుడ్లను సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందంటూ గేమ్ మొదలు పెట్టించాడు బిగ్ బాస్. ఇంకేముంది జెండాలు, గుడ్ల కోసం కంటెస్టెంట్లందరూ ఒకరి మీద ఒకరు పడి ఫైట్లు చేసుకున్నారు. ఇక ఈ గేమ్‌లో చాలామంది గాయాలు కాగా.. అందరూ సిల్లీగా తీసుకోవడంతో పెద్దగా రచ్చ జరగలేదు. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ టాస్క్‌లో మెయిన్ యట్రాక్షన్‌గా మరోసారి వరుణ్ సందేశ్ నిలిచాడు.

గతంలో కెప్టెన్‌గా ఉన్న సమయంలో నెమ్మదస్తుడిగా వ్యవహరించి అందరితోనూ గొడవ పడకుండా మెలిగిన వరుణ్.. నిన్నటి టాస్క్‌లో కూడా అలాగే బిహేవ్ చేసి బోల్తా పడ్డాడు. కొంతమంది కంటెస్టెంట్లు వరుణ్ దగ్గర సాఫ్ట్ గేమ్ ఆడి గుడ్డు దొంగలించారు. దీంతో పక్కనే ఉన్న అతడి భార్య వితిక అది చూసి.. ‘నువ్వు పెద్ద ఫ్రూట్‌వి గుడ్డు కూడా కాపాడుకోలేకపోయావు’ అంటూ పంచ్ వేసింది. ఇక జెండాల కోసం, గుడ్ల కోసం ఒకరిపై ఒకరు పడుతూ కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు పడుతూ యాక్షన్ ఫీట్లు చేశారు.

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.