(Local) Sun, 25 Oct, 2020

బిగ్ బాస్ 3: రోహిణి ఎలిమినేట్ అవుతుందా...?

August 16, 2019,   6:43 PM IST
Share on:
బిగ్ బాస్ 3: రోహిణి ఎలిమినేట్ అవుతుందా...?

బిగ్ బాస్ హౌస్ అంటేనే అందరు కలిసి ఉండటం, కొట్టుకోవటం, టాస్క్, ఎలిమినేషన్ గోల కచ్చితంగా ఉంటుంది కదా మరి... ఈ వారం లగ్జరీ బడ్జెట్ ని చాలా సింపుల్ గా తేల్చేసారు. చిన్న బోర్డ్ కెప్టెన్ కి ఇచ్చి ఎవరికి ఏయే ఐటమ్స్ కావాలో సెలక్ట్ చేయమని చెప్పడంతో అలీ ఒక్కడే టాస్క్ ని ఫినిష్ చేసాడు. హౌస్ మేట్స్ కి రోజులు గడుస్తున్న కొద్దీ టాస్క్ లపైన ఇంట్రస్ట్ తగ్గిపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ ఆడటంలో ఎవరికి వారు స్ట్రాటజీలని క్రియేట్ చేయలేకపోతున్నారు. ఏదైనా ఎక్కువగా మాట్లాడినా, గొడవలు పడాలని చూసినా పబ్లిక్ లో ఇమేజ్ పోతుందేమో అని టెన్షన్ కూడా పట్టుకుంది. వారి న్యాచురాలటీని వదలిసి ఆర్టిఫిషయల్ గా ఉన్నట్లుగా అనిపిస్తోంది. హౌస్ లో రెండు గ్రూప్స్ గా ఉన్న టీమ్స్. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్లు తగ్గితే అంత బెటర్ అనే పొజీషన్ కి వచ్చారు.  పునర్నవి గురించి హిమజ మాట్లాడుతున్నప్పుడు శ్రీముఖి ఎలిమినేషన్ గురించి డిస్కస్ చేసింది. రోహిణి, శివజ్యోతి, రాహుల్, రవి ఈ నలుగురుపైనే తనకి డౌట్ అని చెప్తూ.. రాహుల్ పులిహోర రాజా అని నాగార్జున అన్నాడు కదా.. అందుకే ఎలిమినేట్ అవ్వడు అని, ఈసారి ఖచ్చితంగా నాకు ఎందుకో రోహిణిపైనే డౌట్ గా ఉందని చెప్పింది శ్రీముఖి.
ఇక హిమజ కూడా సపోర్టింగ్ గా మాట్లాడింది. దీన్ని బట్టీ చూస్తే హౌస్ మేట్స్ కి టాస్క్ ల కంటే కూడా ఎలిమినేషన్ ఇంపార్టెంట్ గా మారింది. ఒక్కొక్కరు ఎలిమినేట్ అయి వెళ్లిపోతే బాగుండు అనే మెంటాలిటీతో ఉన్నారు. ఒకరి మద్యన ఒకరికి బాండింగ్ అనేది అస్సలు లేదనే చెప్పాలి. సీజన్ వన్ అండ్ సీజన్ టు రెండింటింని బాగా అవపోసన పట్టి వచ్చిన బ్యాచ్  కావడంతో ప్రతిదాన్ని ముందుగానే ఊహించేస్తున్నారు. చివరకి ఎలిమినేషన్ కూడా గెస్సింగ్ చేయగలుగుతున్నారు అంటే ఎంత స్మార్ట్ గేమ్ ఆడుతున్నారో మనం అర్ధం చేస్కోవచ్చు. ఈ వారం చూస్తే శ్రీముఖి చెప్పినట్లు రోహిణి ఎలిమినేట్ అవుతుందోమే చూడాలి..!

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.