(Local) Wed, 20 Oct, 2021

బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...

November 06, 2019,   6:26 PM IST
Share on:
బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...

బుల్లితెరలో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ షో దాదాపు ఏడూ భాషల్లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో రెండు సీజన్ లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కూడా నవంబర్ 3వ తేదీ తో రాహుల్ ని విన్నర్ ని చేస్తూ ముగిసింది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 3 ముగిసినప్పటికీ షోపై మాత్రం నెటిజెన్ల అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. తాజాగా ఈ కోవలో ఓ ప్రముఖ యాంకర్ సోషల్ మీడియా వేదికగా అసహనం తెలియజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...బిగ్‌బాస్ సీజన్ 3లో ఆడపులిగా పేరు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి. ఆటపాటల్లో, ఇంట్లో ఉండే తీరులో, ఉత్సాహంలో శ్రీముఖి చాలా షార్ప్‌గా ఉంది. నాగార్జున కూడా శ్రీముఖి ఇంట్లో అందరికన్నా చాలా ఉత్సాహంగా ఉంటోందని కితాబు ఇచ్చారు. శ్రీముఖే బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

మరో కోణంలో ఇంతకుముందు రెండు సీజన్‌లలో ఇద్దరూ పురుషులే గెలిచారు. ఈసారి మహిళకు అవకాశం ఇస్తారని భావించారు. కానీ, చివరివరకు కొనసాగిన ఉత్కంఠలో రాహుల్ విజేత అవడంతో శ్రీముఖి అభిమానులు ఉసూరుమన్నారు. రాహుల్ తొలుత నుంచి ఇంట్లో ఏమీ పట్టనట్టు ఉన్నాడని.. ఏ ఆటలోనూ శ్రద్ధ పెట్టలేదని, అతని గెలుపు ఫేక్ అని విమర్శలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ స్పందించారు. ‘అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవడంలేదని, అలాంటిది ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్‌ విజేతగా మహిళను ఎందుకు గెలిపిస్తారని?’ తన ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. లింగభేదం ఇప్పటికీ ఉందని వాపోయారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి పర్ఫార్మెన్స్ చాలా నచ్చిందని... తన బెస్ట్‌ ఇచ్చిందని ఝాన్సీ ప్రశంసలు కురిపించింది.

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.