(Local) Wed, 21 Aug, 2019

సర్వర్‌గా మరీనా వరుణ్ సందేశ్‌....ఇంటి స‌భ్యుల‌పై బిగ్ బాస్ ఫైర్....

August 10, 2019,   12:10 PM IST
Share on:

తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 3 ప్రతి ఎపిసోడ్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తూ బుల్లితెర ప్రేక్షుకులని ఆకట్టుకుంటోంది. అలీ రాజా, పున‌ర్న‌విల‌కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎపిసోడ్‌ 20లో వారిద్ద‌రు బ‌య‌ట‌కి రావాలంటే హౌజ్ మేట్స్ ఇంట్లో చెప్పులు వేసుకోకూడ‌దు, భోజ‌నంలో పెరుగు ఉండ‌ద‌ని చెప్పారు. వాటితో పాటు మ‌గ‌వాళ్ళ నాలుగు మ్యాట్రిసెస్‌, ర‌వికి ఇచ్చినవి కాకుండా పాలు, గుడ్లు స్టోర్ రూంలో పెట్టాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో బిగ్ బాస్ ఆ వ‌స్తువుల‌న్నింటిని స్టోర్ రూంలో పెట్ట‌మని చెప్ప‌డంతో పాలు , పెరుగు, చెప్పులు, గుడ్లు అన్నింటిని స్టోర్ రూంలో పెట్టారు. 


ఇది ఇలా ఉంటే  సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్న‌వికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. వారు ఇంటి స‌భ్యుల‌తో ఉన్న డార్ట్ బోర్డ్‌పై బాణం గుచ్చి వారు ఎందుకు న‌చ్చ‌లేదో కార‌ణం వివ‌రించాల‌ని చెప్పారు. దీంతో పున‌ర్న‌వి ముందుగా హిమ‌జ‌ని ఎంపిక చేసుకొని త‌న‌కి న‌చ్చ‌క పోవ‌డానికి గ‌ల కార‌ణం వివ‌రించింది. ఆ త‌ర్వాత శ్రీముఖి, వితిక, రాహుల్‌, బాబా భాస్కర్ ఫోటోల‌పై బాణం గుచ్చి వారు న‌చ్చ‌క‌పోవ‌డానికి గ‌ల రీజ‌న్ చెప్పింది. ఇక అలీ త‌న‌కు మ‌హేష్ విట్ట‌, త‌మ‌న్న, వితిక న‌చ్చ‌లేద‌ని అన్నాడు... వీట‌న్నింటిని లివింగ్ రూంలో కూర్చున్న ఇంటి స‌భ్యులు వీక్షిస్తూ ర‌క‌ర‌కాల హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌ర్వాత వెల్ క‌మ్ టూం ద పార్టీ సాంగ్ ప్లే కావ‌డంతో పాటు సీక్రెట్ రూం డోర్స్ తెర‌చుకున్నాయి. దీంతో అలీ, పునర్న‌వి మ‌ళ్ళీ లోపలికి వచ్చేసారు. సీక్రెట్ టాస్క్ ను అలీ, పునర్న‌వి స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో వారిద్ద‌రికి ఇమ్యునిటి లభించింద‌ని బిగ్ బాస్ చెబుతూ, వ‌చ్చే వారం వారు నామినేష‌న్‌లో ఉండ‌ర‌ని పేర్కొన్నారు

అంతేకాక బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తూ ఇంట్లో వారు  ఉల్లంఘించిన నియమాల‌ని చూపించి త‌ర్వాత శిక్ష‌లు విధించారు. ముఖ్యంగా కెప్టెన్‌గా ఉన్న వ‌రుణ్ సందేశ్ త‌న బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించ‌డంలో పూర్తిగా విఫలమయ్యారు అంటూ  ఆయ‌న ఇంకో సారి కెప్టెన్ అయ్యే అవ‌కాశాన్ని కోల్పోయాడు అని తెలియజేస్తూ  శిక్షగా వరుణ్ సందేశ్‌ను సర్వర్‌గా మారాలి అని చెప్పారు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్లినా, లోపలికి వచ్చినా వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంటి స‌భ్యులు ఏం చెపితే అది చేయాలి. ప్లేట్స్‌ క‌డ‌గాలి. అలాగే ఆహారం కూడా ఇంటి సభ్యులకు వరుణ్ సందేశ్ అందించాల్సి ఉంటుందని శిక్ష విధించారు.  

ఇక స్మోకింగ్ రూంలో గుంపులుగా ఉన్న బాబా భాస్క‌ర్, అలీ, మ‌హేష్ విట్ట‌, వ‌రుణ్‌, శ్రీముఖిల‌కి కూడా బిగ్ బాస్ శిక్ష విధించారు. డ్ర‌మ్‌కి హోల్స్ పెట్టి అందులో నీరు పోకుండా త‌మ వేలుతో ఆపాల‌ని ఆదేశించారు. ఇక మైకులు పెట్టుకోకుండా, ఊరికే నిద్రిస్తున్న త‌మ‌న్నా, అషూ రెడ్డి, వితిక‌, రోహిణిల‌కి బిగ్ బాస్ ఆదేశం వ‌చ్చిన ప్ర‌తి సారి స్మిమ్మింగ్ పూల్‌లో మున‌గాల‌ని చెప్పారు. బిగ్ బాస్ ఆదేశాల ప్ర‌కారం ఇంటి స‌భ్యులు త‌మ‌కి ఇచ్చిన శిక్ష‌ల‌ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. కొద్ది సేప‌టి త‌ర్వాత వారి శిక్ష‌ల‌కి విముక్తి క‌లిపించాడు బిగ్ బాస్. ఇక నేడు శ‌నివారం కావ‌డంతో నాగార్జున‌తో క‌లిసి ఇంటి స‌భ్యులు సంద‌డి చేయ‌నున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి మరి... 

సంబంధిత వర్గం

బాబా మాస్టర్ ని ఏడిపించిన.....అలీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.