(Local) Sun, 20 Jun, 2021

ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ జంట...

October 22, 2019,   2:10 PM IST
Share on:
ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ జంట...

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద గేమ్ షో బిగ్ బాస్. దాదాపు ఏడూ భాషల్లో ప్రసారమయ్యే ఈ షోపై చాలామంది ఇప్పటివరకు పలు వివాదాలు తెరలేపిన సంగతి విదితమే. ఈ బిగ్ బాస్ గేమ్ షోలో ఎప్పుడు ఎదో ఒక జంట ప్రేమలో పడినట్టే చూపిస్తుంటారని తెలిసిందే. అయితే అది ఎంతవరకు నిజం అనేది చెప్పడం కష్టం. అయితే గత ఏడాది కన్నడ బిగ్‌బాస్ సీజన్ 6లో పాల్గొన్న ర్యాపర్ స్టార్ చందన్ శెట్టి, నివేదితా గౌడల పరిచయం ప్రేమగా మారింది. వీరు బిగ్ బాస్ సీజన్ - 6లో మంచి మిత్రులుగా గుర్తింపు సంపాదించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవల దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మైసూరులో ఓ వేదికపై తమ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఉత్సవాల వేదికపై వివాహ ప్రకటన చేయడంపై వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో వారు క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా చందన్, నివేదితల బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని వారిద్దరూ తెలిపారు.

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.