(Local) Sun, 20 Oct, 2019

సీక్రెట్ గా వీడియోలు ప్లే చేసిన.. బిగ్‌బాస్‌?

August 24, 2019,   3:10 PM IST
Share on:
సీక్రెట్ గా వీడియోలు ప్లే చేసిన.. బిగ్‌బాస్‌?

నాగార్జున వ్యాక్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రోజుకొక రసవత్తర ఘట్టం బుల్లితెరమీదకి కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు సఖ్యత తొ ఉంటుంటే భరించలేకపోతున్నాడో ఏమో బిగ్ బాస్ అందరి మధ్యలో పుల్లలు పెట్టె కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒకరికి తెలియకుండా ఒకరికి వారు ఏమనుకుంటున్నారనేది చూపించి వారి మధ్యలో చిచ్చుపెట్టాడు. ఇప్పుడు వారందరి మధ్యలో అసలైన ఆట మొదలైంది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో వీడియోలు ప్లే చేసాడు బిగ్‌బాస్‌. దీనిలో భాగంగా తన గురించి వితికా, రాహుల్‌ మాట్లాడిన వీడియోలను పునర్నవికి ప్లే చేసి చూపించాడు. దీంతో పునర్నవి వితికా, రాహుల్‌పై అలిగింది. తన గురించి అలా మాట్లాడినందుకు పునర్నవి బాధపడుతూ ఉంటే.. అది సీక్రెట్‌ టాస్క్‌ అని వితికా అనుకుంటూ ఉంది.

ఇక శ్రీముఖికి కూడా తన గురించి మాట్లాడిన వీడియోలను చూపించాడు. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో వితికా, పునర్నవి, రాహుల్‌, వరుణ్‌ మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించగా.. శ్రీముఖి పెద్దగా రియాక్ట్ అవలేదు కానీ ఇది నేను ఊహించిందే అనుకుంటూ... వరుణ్‌ సందేశ్‌ కూడా అలా మాట్లాడటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అలీరెజా గురించి మాట్లాడిన వీడియోలను కూడా చూపించాడు. హిమజ, శ్రీముఖి తన గురించి మాట్లాడిన వీడియోను, బాబా భాస్కర్‌ ఏడ్చిన వీడియోను ప్లే చేశాడు. దీంతో బయటకు వచ్చిన అలీ.. బాబాను క్షమించమని అడిగాడు. తనవల్ల బాబా మాష్టర్‌ ఏడ్చాడని అలీ తెగ బాధపడ్డాడు. వీరందరిని తమ గురించి వెనకాల మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించడానికి పిలవగా.. హిమజకు మాత్రం సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చేందుకు పిలిచాడు.

సంబంధిత వర్గం
ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందా...?
ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందా...?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.