(Local) Sun, 20 Oct, 2019

ఐదో వారం ఎలిమినేట్ అయిన అషు....బిగ్ బాస్ 3

August 26, 2019,   4:20 PM IST
Share on:
ఐదో వారం ఎలిమినేట్ అయిన అషు....బిగ్ బాస్ 3

16 మంది సెలెబ్రిటీస్ ఒకే ఇంట్లో కట్టిపడేసే షో బిగ్ బాస్. ఈ కంటెస్టెంట్స్ లో కేవలం సినీ రంగానికి చెందివారు మాత్రమే ఉండరు, బుల్లితెరపై కనిపించే నటులు కూడా ఉంటారు. ఇంకా అపుడప్పుడు సోషల్ మాధ్యమాల ద్వారా పాపులర్ అయినవారు, సామాన్యులలో ఒకరు ఇలా అన్ని రకాల మనుషులని కలిపే ఒకే ఇంట్లో ఉంచే ఏకైక షో బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారం సందడి ముగిసింది. అలాగే ఇంటి సభ్యులలో నుండి ఒకరు ఎలిమినేట్ కూడా అయ్యారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తోంది. నాగార్జున హౌస్ మేట్స్ తో కలసి వీక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఆదివారం నాగ్ హౌస్ మేట్స్ తో సరదా ఆటలు ఆడించారు.  ఒకరిని ఒకరుగా అనుకరిస్తూ చూపించమని చెప్పి వారి మేడలో అవతలి వారి పేరున్న బోర్డు వేలాడదీసి ఆ బోర్డు మీద ఉన్నా వారి పేరు పెట్టుకుని వారిలా అనుకరిస్తూ చేయాలని చెప్పారు. బాబాభాస్కర్ ను అషు రెడ్డి అనుకరించింది. ఆయనలా మాట్లాడి అందర్నీ నవ్వించింది. బాబా భాస్కర్ అషు రెడ్డిలా అందరికీ మేకప్ వేస్తున్నట్టు అనుకరించి చూపించి వినోదాన్ని పంచారు. పునర్నవి వరుణ్ లా.. వరుణ్ పునర్నవి లా.. ఇక మహేష్ శివజ్యోతి లా, శివజ్యోతి మహేష్ లా చేశారు. అదేవిధంగా రవికృష్ణ హిమజ లా.. హిమజ రవికృష్ణలా చేశారు. తర్వాత రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నారని ప్రకటించారు. ఇక అలీ వితిక లా నటించి చూపించి అందర్నీ నవ్వుల్లో ముంచారు. ఫైనల్ గా  ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా అషు రెడ్డి ఎలిమినేట్ అయింది నాగ్ చెప్పగా అందరూ షాక్ గురయ్యి అషు ని పంపించే ప్రక్రియలో  ఆమెకి సూట్ కేసు సర్దుకుంటుండగా అషు ఒక వైట్ టీ షర్ట్ మీద అందరి గుర్తు గా ఎదో ఒకటి రాయమని అడిగింది, అందరూ వాళ్లకి నచ్చింది రాసి చివరిగా అషు తో సెల్ఫీ దిగి ఇంటి నుండి బయటకు పంపించారు

సంబంధిత వర్గం
ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందా...?
ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందా...?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.