
నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు కొనసాగే షోలో ఎవరైనా ఎలాంటి పనులు చేసిన శని, ఆదివారాలలో ఇంటి సభ్యులకు అతి సున్నితంగా స్వీట్ వార్నింగ్, క్లాసులు, ఎలిమినేషన్స్ తప్పవు. ఇది అంత ఎలా ఉన్న... సోమవారం వచ్చిందంటే.. కంటెస్టెంట్స్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయి. ఎవరిని ఎలిమినేట్ చేయాలో.. తెలీయక తలలు పట్టుకుంటున్నారు. నీది తప్పంటే.. నీది తప్పని.. వాదించుకుంటున్నారు. ఇదే సరైన పాయింట్ అని.. ఆ గొడవలు.. ఎలిమినేషన్స్ రౌండ్లోకి తీసుకొచ్చి.. ఇంటి సభ్యులను నామినేటెడ్ చేస్తున్నారు. కాగా.. తాజాగా.. 4వ వారంలో.. రోహిణీ ఎలిమినేట్ అయ్యింది. దానికి కారణం నేనేమో అని శివజ్యోతి తెగ బాధపడింది.అయితే నిన్న సోమవారం కావడంతో నామినేట్ ప్రక్రియ సరికొత్తగా నిర్వహించారు బిగ్ బాస్. ఇంటి సభ్యులందిరిని కూర్చోపెట్టి వారి మద్యలో ఒక టేబుల్ మీద పింక్ కలర్ పౌడర్ ఉంచి వాటి పక్కన చిన్న బాక్స్ లో రెడ్ కలర్, బ్లాక్ కలర్ బాల్ ఉంచడం జరిగింది. రెడ్ కలర్ బాల్ వస్తే కంటెన్స్టెంట్ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి ఇద్దరి ఇంటి సభ్యులని నామినేట్ చేయాలి. అదే బ్లాక్ కలర్ బాల్ వస్తే అక్కడే మిగతా ఇంటి సభ్యులా ముందు అక్కడే ఉన్న పింక్ కలర్ పొడి తీసుకుని ఇద్దరి ఇంటి సభ్యులని నామినేట్ చేస్తూ కారణం వివరించాలి.
ఈ విధంగా నామినేషన్ కార్యక్రమం పూర్తయింది అనుకునే అంతలో బిగ్ బాస్ ఆలీకి వున్న కెప్టెన్ పవర్‌తో.. ఒక ఇంటి సభ్యుడిని నామినేట్ చేయాలని ఆదేశించగా.. దానికి బాబా మాస్టర్‌ను నామినేట్ చేస్తాడు అలీ. తనను నామినేట్ చేసినందుకు బోరుమన్నారు బాబా మాస్టర్. ఎప్పుడూ హైపర్ యాక్టీవ్‌గా ఉంటూ.. ఇంట్లోని సభ్యులందరినీ నవ్వించే బాబా మాస్టర్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యేసరికి హౌస్మెట్స్ అందరూ షాక్ తిన్నారు. అలీ బాబా మాస్టర్ డైరెక్ట్ నామినేట్ చేసేసరికి దానికి ఆయన ఓ రేంజ్లో ఫీలయ్యారు. మరొక బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీముఖి వద్ద తన బాధను చెప్తూ.. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇది చూసిన ఇంటి సభ్యులు ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి.. ఒకప్పటి మిత్రులు కూడా.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే.. శత్రువులవడం ఖాయమని.. తెలుస్తోంది. ఎందుకంటే.. అది బిగ్‌బాస్ హౌస్.. అక్కడ ఏమైనా జరగవచ్చు. కాగా.. ఈవారం ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వారు: పునర్నవి, రాహుల్, హిమజ, అషురెడ్డి, మహేష్, బాబా మాస్టర్, శివజ్యోతిలు. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనేది కాస్త థ్రిల్లింగ్ గానే ఉంది
-
పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
27 Nov 2019, 3:41 PM
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
నాగ్ మరోసారి రకుల్ తో?
18 Nov 2019, 11:40 PM
-
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
14 Nov 2019, 3:49 PM
-
బిగ్ బాస్ పై యాంకర్ ఝాన్సీ అసహనం...
06 Nov 2019, 6:26 PM
-
రాహుల్ ట్రోఫీని అందుకే గెలుచుకున్నాడు...!
04 Nov 2019, 4:17 PM
-
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
01 Nov 2019, 5:57 PM
-
హౌస్ మేట్స్ కి మధుర క్షణాలు గుర్తు చేసిన బిగ్ బాస ...
01 Nov 2019, 4:44 PM
-
మా అబ్బాయిని గెలిపించండి...
01 Nov 2019, 1:50 PM
-
అందమైన జ్ఞాపకాలను గుర్తు చేయబోతున్న...బిగ్ బాస్
30 Oct 2019, 6:54 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.