(Local) Tue, 27 Oct, 2020

బెల్లంకొండ 8 ప్యాక్ లుక్‌ లో....సంతోష్ శ్రీనివాస్‌ల చిత్రం

November 28, 2019,   4:17 PM IST
Share on:
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్‌ లో....సంతోష్ శ్రీనివాస్‌ ...

2014లో అల్లుడు శీను చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేసిన నిర్మాత తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్...ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిచినప్పటికీ పెద్దగా ఆ చిత్రాలు విజయాన్ని అందించలేదు...కాగా ఈ ఏడాది `రాక్ష‌సుడు`తో సూప‌ర్ హిట్ అందుకున్న ఈ  యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఆ ఉత్సాహంతో మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. న‌వంబ‌ర్ 29న హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈసినిమా గ్రాండ్ లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రారంభోత్స‌వానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు.

రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డబోతున్నారు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌త్యేకంగా 8ప్యాక్స్‌తో మేకోవ‌ర్ తో... కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించనున్నాడు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల సినిమాటోగ్ర‌ఫీ అందించిన డూడ్లే ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `అల్లుడుశీను`, `జ‌య‌జానకి నాయ‌క‌` చిత్రాల త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.