(Local) Mon, 18 Oct, 2021

'సరిలేరు నీకెవ్వరు' లో లీకైన బండ్ల గణేష్ లుక్....

August 16, 2019,   2:28 PM IST
Share on:
'సరిలేరు నీకెవ్వరు' లో లీకైన బండ్ల గణేష్ లుక్....

తెలుగులో ఒక సామెత ఉంది..ఎవరికైనా అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే ...నక్క తోక తొక్కి వచ్చాడు అంటారు. అలాంటి ఓ వ్యక్తిలో బండ్ల గణేష్ ఒకరు. వెండితెరపై కమెడియన్‌గా పరిచయమై ఆ తర్వాత అనతికాలంలోనే బడా నిర్మాతగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు బండ్ల గణేష్ ఒక హాట్ టాపిక్ మాత్రమే కాకుండా బండ్ల గణేష్ పేరునుండి బ్లేడ్ గణేష్ గా ఆయనను పలువురు పిలవడం కూడా తెలిసిన విషయమే. ఏపీ ఎన్నికల సమయంలో ఓ ఇంటర్వ్యూ లో ఎలక్షన్స్ టైములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  రావడం  ఖాయం’  ఒకవేళ మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్..అంటూ ఆయన చేసిన శపథం హైలైట్ గా నిలిచింది. అయితే ఆయనకు రాజకీయాలు రావని తప్పుకోవడంతో ఇప్పుడు ఆయన మళ్ళీ సినిమాల మీదా, వ్యాపారాల మీదా ద్రుష్టి పెట్టాడు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' లో ఆయన మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తనున్నాడు.

ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మద్యనే సినిమాలో కీలకమైన ట్రైన్ షెడ్యూల్ ని శరవేగంగా షూట్ చేస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు రీసెంట్ గా బయటకు వచ్చాయి.  ఈ ఫోటోలలో బండ్ల గణేష్ తో పాటు దర్శకుడు అనిల్.. హీరోయిన్ రష్మిక.., సంగీత, హరితేజ  తదితరులు ఉన్నారు. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఆయన పేరు బ్లేడ్ గణేష్ అని అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాశాడని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.