(Local) Mon, 16 Sep, 2019

బాలకృష్ణ సరికొత్త లుక్ వైరల్...

August 20, 2019,   4:37 PM IST
Views: 77
Share on:
బాలకృష్ణ సరికొత్త లుక్ వైరల్...

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను బయోపిక్ గా తెరకెక్కించగా ఆ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మహానాయకుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలయ్య 105వ చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. తాజాగా బాలయ్య బాబు లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. బ్లూ కలర్ సూట్ వేసుకుని, బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకుని, న్యూ ట్రెండ్ గా కనిపించే గడ్డం, మీసంలో యంగ్ గా కనిపిస్తూ స్టైల్ గా వాక్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. ఈ నయా లుక్‌లో బాలకృష్ణను చూసి అభిమానులు  థ్రిల్ అవుతున్నారు. మంగళవారం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

సంబంధిత వర్గం
నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం న్యూ లుక్....
నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం న్యూ లుక్....
స్టైలిష్ గెడ్డంతో యంగ్ లుక్‌ లో...ఓల్డ్ హీరో
స్టైలిష్ గెడ్డంతో యంగ్ లుక్‌ లో...ఓల్డ్ హీరో

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.