(Local) Thu, 24 Sep, 2020

స్టైలిష్ గెడ్డంతో యంగ్ లుక్‌ లో...ఓల్డ్ హీరో

August 20, 2019,   1:24 PM IST
Share on:
స్టైలిష్ గెడ్డంతో యంగ్ లుక్‌ లో...ఓల్డ్ హీరో

బాలకృష్ణ సినిమా పాత్రలలో వైవిధ్యం కనిపిస్తుంది కానీ... అయన లుక్స్ కి సంబంధించి డిఫరెంట్ షేడ్ లో ఉన్న సినిమాలు చాల తక్కువే అని చెప్పవచ్చు. ఆ మధ్య 2008లో వచ్చిన ఒక్కమగాడు చిత్రంలో బాలయ్య ద్విపాత్రానభినయం చేయగా అందులో సిమ్రాన్ భర్తగా ముసలివాడు లుక్స్ లో కనిపించగా. మళ్ళి ఆ తర్వాత శ్రీరామ రాజ్యంలో రాముడిగా, పాండురంగడు మూవీలో కృషుడిగా కనిపించరు. ఆ తర్వాత మళ్ళి రీసెంట్ గా బాలయ్య త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు సినిమాలలో తన తండ్రి విశ్వవిఖ్యాత తారక రామారావుగారి పాత్రలో కనిపించి మెప్పించారు. కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే తన లుక్స్ చేంజ్ కనిపించే విధంగా సినిమాలు చేసారు. తాజాగా బాల‌య్య ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రూల‌ర్ అనే పేరుతో ఈ చిత్రం ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తుంది. సోనాల్ చౌహ‌న్‌, వేదిక చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని తెలుస్తుండ‌గా, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇక విల‌న్‌గా త‌మిళ భామ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావించిననప్పటికి, అది వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో ఆమె స్థానంలో న‌మిత లేడీ విల‌న్‌గా చిత్రంలో అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. చిత్రంలో బాల‌య్య లుక్ ఎలా ఉంటుంద‌నే దానిపై కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు నడుస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న లుక్ ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. స్టైలిష్ గెడ్డంతో యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు బాల‌య్య‌. ఈ లుక్ అభిమానుల‌ని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. జై సింహా త‌ర్వాత కేఎస్ ర‌వికుమార్- బాల‌య్య కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుండ‌డంతో ఈ సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.
 

సంబంధిత వర్గం
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.