(Local) Mon, 27 Sep, 2021

అదరగొడుతున్న బాలా ఫస్ట్ డే కలెక్షన్స్....

November 09, 2019,   9:50 PM IST
Share on:
అదరగొడుతున్న బాలా ఫస్ట్ డే కలెక్షన్స్....

ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు...ఎందుకంటే అతి తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయిన హీరో...ఖురానా నటించే ప్రతి చిత్రం ఎంతో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు... ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అతని మార్కెట్ కూడా పెరుగుతోంది. బుల్లితెర నుంచి వెండితెర వరకు కష్టపడి పైకొచ్చిన ఆయుష్మాన్ గత మూడేళ్ళుగా వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో జనాలని ఆకర్షిస్తున్నాడు.

మొన్న ‘డ్రీమ్ గర్ల్’ తో సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ డైనమిక్ ఈ హీరో ఇప్పుడు ‘బాలా’ సినిమాతో మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. బట్టతల కారణంగా ఎదురయ్యే సమస్యలు, దాన్ని కవర్ చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు ఈ సినిమాలో మెయిన్ హైలెట్ పాయింట్స్ఒక బట్టతల కాన్సెప్ట్ తో ఆయుష్మాన్ ఆడియెన్స్ ని ఎంతగా ఆకర్షించాడో మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ ని చుస్తే అర్ధమవుతుంది.

ఫస్ట్ డే బాలా సినిమా 10.15కోట్ల వసూళ్లతో ఆయుష్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన డ్రీమ్ గర్ల్ లో ఆయుష్మాన్ అమ్మాయిగా కనిపించి 150 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు బాలా సినిమాతో మరో కొత్త పాయింట్ ని ప్రజెంట్ చేస్తూ అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంటున్నాడు.

సంబంధిత వర్గం
శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌ ఫస్ట్ లుక్ రిలీజ్
శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌ ఫస్ట్ లుక్ రిలీజ్
‘పతి, పత్నీ ఔర్ వో’ ట్రైలర్ విడుదలైంది...
‘పతి, పత్నీ ఔర్ వో’ ట్రైలర్ విడుదలైంది...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.