(Local) Tue, 02 Mar, 2021

‘బాబు చంపేస్తాడు’....వర్మ

September 24, 2019,   12:47 PM IST
Share on:
‘బాబు చంపేస్తాడు’....వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ పరిచయమవసరం అవసరం లేదు....వర్మ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సోషల్ మీడియాలో ఎదో ఒకటి మాట్లాడి ట్రెండ్ అవుతున్నాడు వర్మ. తాజాగా ఆయన తన సినిమా ప్రమోషన్ కూడా సంచలనంగానే చేస్తన్నాడు.  అదే బయోపిక్ లాంటి సినిమాలు అయితే చెప్పాల్సిన పనిలేదు కావాల్సినంతగా కాంట్రవర్సీ చేస్తారు. అలాంటి ఆర్జీవీ తాజాగా తెరకెక్కిస్తున్న ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా  ప్రమోషన్ తనదైన శైలిలో ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా నుంచి ఈరోజు ‘బాబు చంపేస్తాడు’ పాటను విడుదల చేయబోతున్నారు. దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని ‘బాబు చంపేస్తాడు’ అనే పాటను ఈరోజు సాయంత్రం వీరబ్రహ్మ ముహూర్తమైన 4.37 గం.లకు విడుదల చేయబోతున్నామని చెప్పాను. కానీ చిన్న సవరణతో పరమ వీరబ్రహ్మ ముహూర్తమైన 4.59 గం.లకు విడుదల చేస్తున్నాం. దయచేసి విని ఆనందించండి.. ఆలోచించండి అంటూ ట్వీట్ చేశారు. నిజానికి ఆర్జీవి ముహూర్తాలు, సెంటిమెంట్లకు దూరంగా ఉంటారు. కానీ ముహూర్తాన్ని ఉటంకిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. 

సంబంధిత వర్గం
బ్రూస్‌లీ జయంతి సందర్భంగా `ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న ...
బ్రూస్‌లీ జయంతి సందర్భంగా `ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న ...
'ఏయ్ ఏసేయ్ రా నా కొడుకుని'.....ఆర్జివి
'ఏయ్ ఏసేయ్ రా నా కొడుకుని'.....ఆర్జివి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.