(Local) Tue, 27 Oct, 2020

బాబా భాస్కర్ మాస్టర్ జాక్ పాట్ కొట్టారు...

October 26, 2019,   12:02 PM IST
Share on:
బాబా భాస్కర్ మాస్టర్ జాక్ పాట్ కొట్టారు...

బుల్లితెరపై ప్రేక్షుకులను అలరించే రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో రెండు సీజన్ లు పూర్తిచేసుకొని మూడో సీజన్ లోకి అడుగుపెట్టి చివరికి దశకు చేరుకోవడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకొనే నేపథ్యంలో ఈ గేమ్ షో రసవత్తరంగా సాగుతోంది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో మాస్టర్ బాబా భాస్కర్ జాక్ పాట్ కొట్టారు. బిగ్ బాస్ 3 ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ నేరుగా ఫైనల్స్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్‌లో ఉన్నందుకు వారు ఏమేం పొందారు?, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏం మిస్ అవుతారు?, ఏం వదిలి వెళ్లాలనుకుంటున్నారంటూ కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి కంటెస్టెంట్లు సమాధానం ఇచ్చారు. తరువాత ఈ వారం ఒకర్ని సేవ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో బాబా భాస్కర్ మాస్టర్‌ను బిగ్ బాస్ సేవ్ చేశాడు.
 

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.