(Local) Mon, 26 Aug, 2019

డ్రీమ్‌గ‌ర్ల్ ట్రైల‌ర్‌ లో అదరగొడుతున్న ఆయుష్మాన్....

August 12, 2019,   5:09 PM IST
Share on:

జాతీయ ఉత్త‌మ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన 'ఆర్టికల్15' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా  ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్‌గ‌ర్ల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీలో ఆయుష్మాన్  ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. కామిడీ క‌థా నేప‌థ్యంతో వ‌స్తున్న ఈ చిత్రం మ‌రోసారి ఆయుష్మాన్‌కు పెద్ద హిట్ ఇచ్చేలా ఉన్న‌ది. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే 424 వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకోబోతోంది. కాల్ సెంట‌ర్‌లో ప‌నిచేస్తున్న హీరో ... ఆడ గొంతుతో క‌స్ట‌మ‌ర్ల‌కు కిక్ ఎక్కిస్తున్నాడు. డ్రీమ్‌గ‌ర్ల్ లుక్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ఆయుష్మాన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలిపాడు. అన్నూ క‌పూర్‌, నుష్ర‌త్ బ‌రూచా కూడా ఈ ఫిల్మ్‌లో న‌టిస్తున్నారు. పూజ అనే అమ్మాయి పేరుతో హీరో ఆడ‌గొంతుతో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తున్నాడు. యూపీలోని మ‌థురలో ఫిల్మ్ షూటింగ్ జ‌రిపారు. రాజ్ శాండిల్య దీన్ని డైర‌క్ట్ చేస్తున్నాడు. గత ఏడాది అందాధున్‌, బ‌దాయి హోల‌తో హిట్ కొట్టిన ఆయుష్మాన్ ఈ ఏడాది కూడా ఆర్టిక‌ల్ 15తో ఊపుమీద క‌నిపించాడు. ఇక ఇప్పుడు డ్రీమ్‌గ‌ర్ల్ అత‌ని స్టార్‌డ‌మ్‌ను మ‌రింత పెంచేలా ఉంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.