(Local) Mon, 16 Sep, 2019

సీజన్ 11లో అడుగుపెట్టిన కేబీసీ.....

August 20, 2019,   1:01 PM IST
Views: 82
Share on:
సీజన్ 11లో అడుగుపెట్టిన కేబీసీ.....

బిగ్ బి అమితాబ్ ఏడూ పదుల వయస్సు దాటినా కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా తనదైన స్టైల్ లో దూసుకుపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. నటన పరంగా ఆయనకి సాటి ఎవరు లేరని అందరికి తెలిసిన సంగతే. కేవలం సినిమా అనే కాకుండా వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ, అవకాశం దొరికినప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తూ అభిమానులకు చాలా దగ్గరయ్యారనే చెప్పాలి. కాగా బుల్లితెరపై కౌన్ బనేగా క్రౌర్ పతి షోతో ఎంతగా పాపులర్ అయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత 19 ఏళ్ల నుంచి 10 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్ బి ఇప్పుడు 11వ సీజన్ తో రెడీ అయ్యాడు. ఓ వైపు నటుడిగా బిజీ అవుతూనే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నిన్న సోమవారం కేబీసీ 11వ సిజన్ సోని టీవీ లో ప్రసారం అయింది.  సామాన్యులను హాట్ సీట్ లోకి రప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపే ఈ షో భారతదేశ ప్రముఖ భాషల్లో చాలా వరకు క్లిక్కయ్యింది. ఇక షోకి సంబందించిన ఒక వీడియోను అమితాబ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఎన్నో జ్ఞాపకాలతో నిండిన కేబీసీ మరో అడుగు వేయబోతున్నట్లు చెప్పారు. మరి ఈ సీజన్ లో ఎంతమంది సామాన్యుల జీవితాల్ని ఈ షో మారుస్తుందో చూడాలి.

సంబంధిత వర్గం
చిరు ఆఫీస్ ముందు  ‘ఉయ్యాలవాడ’ వంశీయులు ధర్నా...
చిరు ఆఫీస్ ముందు ‘ఉయ్యాలవాడ’ వంశీయులు ధర్నా...
మరి కొద్ది నిమిషాల‌లో మెగా ఫాన్స్ కి ట్రీట్....
మరి కొద్ది నిమిషాల‌లో మెగా ఫాన్స్ కి ట్రీట్....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.