(Local) Fri, 07 May, 2021

ఆ హీరో పై ఫాన్స్ చేస్తున్న 'వార్'.......

September 03, 2019,   11:52 PM IST
Share on:
ఆ హీరో పై ఫాన్స్ చేస్తున్న 'వార్'.......

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మరింత చిన్నదైపోయింది. సెలబ్రెటీలు తమ అభిమానులకు ఈ సోషల్ మీడియా ద్వారా దగ్గరవుతుంటారు. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది కుర్ర హీరోలు స్టార్ హీరోలను కామెంట్ చేసి అనవసరంగా తిట్లు తింటుంటారు. సోషల్ మీడియాలో అనవసరంగా ఏదైనా కామెంట్ చేస్తే చాలు స్టార్లకు సైతం తిట్లు చీవాట్లు తప్పడం లేదు.తాజాగా హృతిక్, టైగర్ పై కామెంట్ చేసి అనవసరంగా అభిమానుల చేతిలో తిట్లు తిన్నాడు ఓ కుర్ర హీరో. వివరాల్లోకి వెళ్తే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సినిమా "వార్" ఈ సినిమా షూటిగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా షూటిగ్ పూర్తి చేసుకున్నతర్వాత కొన్నిషూటింగ్ ఫోటోలను హృతిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే అందులో ఒక ఫొటోలో డైరెక్టర్ కుర్చీ పైన కూర్చొని ఉంటే హృతిక్, టైగర్ నేల పైన కూరుకొని కనిపిస్తారు..అయితే ఈ ఫోటో పై బాలీవుడ్ యాంగ్ హీరో అర్జున్ కపూర్ స్పందిస్తూ ``ది లెజెండ్ అండ్ 2 రెగ్యులర్ యాక్టర్స్`` అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో రెచ్చిపోయిన, అభిమానులు స్టార్ హీరోలను పట్టుకొని అంతమాటంటావా.. ? వల్లే రెగ్యులర్ యాక్టర్స్ అయితే నువ్వు క్యాటగిరికి చెందుతావో చూసుకోవాలని మండిపడుతున్నారు. అయితే అర్జున్ కపూర్  మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మలైకా తో ఎఫైర్ పెట్టుకోవడంతో బాలీవుడ్ లో చాలామంది అర్జున్ కు దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తుంది. మరో వైపు  అర్జున్ కపూర్ మొత్తం కపూర్ ఫ్యామిలీకి తలవొంపులు తీస్తున్నాడని కొంతమంది విమర్శిస్తున్నారు.

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.