(Local) Sat, 19 Oct, 2019

రామన్నగారు నన్ను క్షమించండి....

September 13, 2019,   2:46 PM IST
Share on:
రామన్నగారు నన్ను క్షమించండి....

అడవుల తమంత తాముగా దట్టంగా ఏపుగా వేలాదిగా కొన్ని చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి జనావాసాలు, నాగరికత చిహ్నాలు లేకుండా సహజ సిద్ధంగా జంతు వృక్ష వైవిధ్యానికి ఆలవాలమైన పచ్చని వృక్ష జాతి పరంపరను అడవులు అంటాము.అంతేకాక ప్రకృతి వైపరీత్యాల నుండి తప్పించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మానవ పరిణామ క్రమంలో అభివృద్ధి కోసం ఎన్నో జీవజాతులు, అడవులు మాయమైపోయాయి. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టాలీవుడ్ దర్శకులు, తారలతోపాటు పలువురు సెలబ్రిటీలు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ కూడా ఈ కోవలో చేరిపోయారు. నల్లమలను నాశనం చేస్తే అక్కడ గడ్డికూడా మొలవదని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రి ఈ విషయాన్ని గుర్తించాలంటూ ఎమ్మెల్యే జోగు రామన్నను ఆమె ట్వీట్‌లో ట్యాగు చేశారు. అనసూయ ట్వీట్ లో  ‘ఇప్పుడే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకున్నా. యురేనియం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కావాలంట. సో, నేచురల్‌గా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపి.. ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కునే వాళ్లకే పీల్చడానికి గాలి లేకపోతే ఊపిరి ఆడక చావు.. అంతేగా??. ఇదేగా మన ఫ్యూచర్?? ఎలా అలో సార్ ఇదంతా?? ఆలోచించడానికే భయం వేయలేదా?’’ ట్వీట్ చేశారు. ఇందులో జోగు రామన్నను ట్యాగు చేశారు. ఆయన గత కేబినెట్లో అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేయడంతో ఇప్పుడు కూడా ఆ శాఖ మంత్రిగానే ఉన్నారని యాంకర్ పొరపడ్డారు. తర్వాత విషయం తెలుసుకుని ఆయనను క్షమాపణ కోరారు. 

సంబంధిత వర్గం
దళపతి మూవీ ట్రైలర్ చూస్తే ‘విజిల్’ వేయాల్సిందే..
దళపతి మూవీ ట్రైలర్ చూస్తే ‘విజిల్’ వేయాల్సిందే..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.