(Local) Mon, 23 Sep, 2019

స్టేజ్‌పై ఓ పెద్దావిడ కాళ్లు మొక్కిన ....బిగ్‌బి

August 23, 2019,   11:06 PM IST
Views: 92
Share on:
స్టేజ్‌పై  ఓ పెద్దావిడ కాళ్లు మొక్కిన ....బిగ్‌బి

ఎంత ఎత్తుకి ఎదిగిన తల్లికి మాత్రం బిడ్డే అని మన పెద్దవాళ్లు అంటుంటారు. కని పెంచిన అమ్మకి బిడ్డ ఆ స్థాయిలో ఉన్న కాళ్ళకి నమస్కరిస్తే అది అమ్మకి ఇచ్చే విలువ, అదే కనకపోయిన తల్లి లాంటి వాళ్ళకి నమస్కరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు ఇదా అంత ఎందుకు అనుకుంటున్నారా....బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ని చూడగానే ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తుంటారు. అలాంటిది స్టేజ్‌పై బిగ్‌బినే ఓ పెద్దావిడ కాళ్లు మొక్కారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. సింధూతాయ్‌ సప్కల్‌. ఆమె మహారాష్ట్రకు చెందిన ఓ సామాజికవేత్త. దాదాపు వెయ్యి మందికిపైగా అనాథలకు అన్నీ తానై చూసుకుంటోంది. కేబీసీ తాజా సీజన్‌లో ఈ రోజు ఎపిసోడ్‌లో సింధూతాయ్‌ పాల్గొన్నారు.

‘నీ కన్నీటి ద్వారా జీవితాన్ని చూడు. ఏడ్చిన తర్వాత నవ్వడం నేర్చుకో. ఎందుకంటే నేను నీకు తల్లిలాంటిదాన్ని. నీతోనే ఉంటాను బేటా’ అంటూ సింధూతాయ్‌..అమితాబ్ ముందు ఓ మరాఠీ పద్యం పాడారు. ఆ తర్వాత ఆమె గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ఆయన సీటు నుంచి లేచి ఆమె పాదాలను నమస్కరించారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వర్గం
'సైరా' సెన్సార్ పూర్తి...
'సైరా' సెన్సార్ పూర్తి...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.