(Local) Wed, 21 Oct, 2020

బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....

November 28, 2019,   5:59 PM IST
Share on:
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....

ఏడూ పదుల వయసు దాటినప్పటికీ వెండితెరపై తనదైన నటనతో దూసుకుపోతూ ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించగల నటుడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. కాగా ఈ మధ్య అమితాబ్ ఆరోగ్యం సరిగా లేకపోవడం తో ఆసుపత్రి వెళ్లిన సంగతి కూడా విదితమే. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక ఆయన మళ్ళీ షూటింగ్స్, కేబీసీ షోస్ లో పాల్గొంటున్నారు....అయితే ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ అమితాబ్ సంచలన పోస్ట్ చేశారు. సినిమాల నుంచి తాను రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘మనసు ఉత్సాహపడుతున్నా శరీరం సహకరించడం లేదు. మెదడు ఒకటి ఆలోచిస్తోంది, చేతి వేళ్లు మరొక సందేశాన్నిస్తున్నాయి. బహుశా నేను రిటైర్ కావాలని పరోక్షంగా అవి తెలియజేస్తున్నాయి అనుకుంటా’ అంటూ తన అధికారిక బ్లాగ్‌లో పోస్ట్ చేశారు.

తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్‌లో భాగంగా అమితాబ్ మనాలీ వెళ్లారు. అక్కడ హోటల్ నుంచి కారులో సెట్స్‌కు వెళ్తున్న సమయంలో ఈ రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందన్నారు. సినిమాలతో ఆయనది 50 ఏళ్ళ అనుబంధం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి చికిత్స పొందుతున్నప్పటికీ వయసు రీత్యా ఒక్కోసారి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవలే అనారోగ్యంతో కొన్నాళ్లు ఆసుపత్రిలో గడిపారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినప్పటికీ డిశ్చార్జి అయిన రెండు రోజులకే ఆయన సెట్స్‌కు వెళ్లిపోయారు. 

..

సంబంధిత వర్గం
ఈ షో ఆడవారికి మాత్రమే....హోస్ట్ గా అలనాటి నటి
ఈ షో ఆడవారికి మాత్రమే....హోస్ట్ గా అలనాటి నటి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.