(Local) Sun, 25 Jul, 2021

అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...

October 21, 2019,   5:48 PM IST
Share on:
అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఆయనని చూడటం కోసం ముంబైలోని బిగ్ బి ఇంటి ముందు చిన్నపిల్లలతో మొదలుకొని ముసలి వారి వరకు క్యూ కడతారని తెలిసిందే. గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముంబయిలో నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రతీ ఆదివారం తన ఇంటికి భారీగా వచ్చే అభిమానులను పలకరిస్తారు. ఆయన ఆస్పత్రిలో వుండటంతో అది వాయిదా పడింది.

తాజాగా నిన్న ఆదివారం కావడంతో బిగ్ బి చూసేటందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటివద్దకు వచ్చారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అభిమానులు అలాగే రోడ్డుపై నిలబడి అమితాబ్‌ కోసం ఎదురు చూశారు. అయితే అమితాబ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అమితాబ్‌ అభిమానులను కలవలేకపోయారు. తనని చూసేందుకు వచ్చిన అభిమానుల నిరాశను పసిగట్టారు ఆయన. తన ఇంటిముందు నిల్చున్న వారి ఫోటోలను సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. ‘సండే మీట్‌లో భాగంగా నన్ను కలిసేందుకు ఎందరో అభిమానులు నా నివాసం వద్దకు వచ్చారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. అందుకే అభిమానులను కలవడం కుదరలేదు. నన్ను మన్నించండి’ అని అమితాబ్‌ ట్వీట్ చేశారు. 

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.