(Local) Fri, 07 May, 2021

మంగళసూత్రం కోసం కేబీసీ షోకి వచ్చాడు...

October 25, 2019,   6:24 PM IST
Share on:
మంగళసూత్రం కోసం కేబీసీ షోకి వచ్చాడు...

బుల్లితెరపై చాలామందిని అలరించే షో కౌన్ బనేగా కరోడ్‌పతి....బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ కేబీసీ 11వ సీజన్‌ మంచి ఆదరణ ఉందని తెలిసిందే. ఈ షోకు ఎంతో మంది కంటెస్టెంట్లు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారు గెలుచుకున్నప్రైజ్ మనీ ఏం చేస్తారంటూ అమితాబ్ అడగటం.. వారు దానికి సమాధానం చెప్పడం కామన్. కానీ గురువారం ప్రసారమైన ప్రోగ్రామ్‌లో బిహార్‌కు చెందిన కుమార్ రంజన్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమితాబ్ కూడా కొంతసేపు షాక్‌లో ఉండిపోయాడు.ఇంతకీ కుమార్ రంజన్ ఈ షోకు రావడానికి కారణం ఏంటంటే తన భార్యకు బంగారు మంగళసూత్రం కోసం. దాన్ని ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కేబిసీకి వచ్చినట్టు తెలిపాడు.  కొన్ని రోజుల క్రితం కుమార్ రంజన్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ల సపోర్టు లేకపోవడంతో వాళ్లకు దూరంగా ఉంటూ జీవిస్తున్నాడు. పెళ్లి అయినా కూడా తన భార్యకు బంగారు మంగళసూత్రం కూడా లేకపోవడంతో ఎలాగైనా తనకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే తాను చేసే ఉద్యోగంతో మంగళసూత్రం కొనడం కష్టమని భావించి అందుకే ఈ షోలో పాల్గొన్నట్టు తెలిపాడు. ఇది విన్నాక అమితాబ్‌తో పాటు అక్కడున్నవారు కూడా షాకయ్యారు. కాాగా ఇటీవల అమితాబ్ రెగ్యులర్ చెకప్‌లో భాగంగా మూడు  రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన తిరిగి కేబీసీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...
అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.