(Local) Fri, 07 May, 2021

ఆస్పత్రి నుంచి బిగ్ బీ డిశ్చార్జ్...

October 19, 2019,   3:30 PM IST
Share on:
ఆస్పత్రి నుంచి బిగ్ బీ డిశ్చార్జ్...

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధ సమస్యతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రిలో చేరారని నానావతి ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల కోసమే అమితాబ్ ఆస్పత్రిలో చేరారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పినప్పటికీ ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు. అయితే నిన్న శుక్ర‌వారం రాత్రి 9.45 గంటలకు అమితాబ్ బచ్చన్‌ను నానావతి ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. డిశ్చార్జ్ అయిన అమితాబ్‌ని ఆయ‌న కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్, భార్య జ‌యాబ‌చ్చ‌న్‌లు కారులో ఇంటికి తీసుకెళ్ళారు. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని కూడా చెప్పారు. ప్ర‌స్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 11 కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న అమితాబ్.. సూజిత్ సర్కార్ గులాబో సితాబ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల అమితాబ్ సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన విష‌యం తెలిసిందే. 

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
ఆసుపత్రిలో చేరిన బిగ్ బి...!
ఆసుపత్రిలో చేరిన బిగ్ బి...!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.