(Local) Mon, 27 Sep, 2021

ఆసుపత్రిలో చేరిన బిగ్ బి...!

October 18, 2019,   1:41 PM IST
Share on:
ఆసుపత్రిలో చేరిన బిగ్ బి...!

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తెలియని వారు ఎవరు ఉండరు....ఎందుకంటే ఆయనకి ఉండే క్రేజ్ అలాంటిది. బిగ్ బి విషయంలో చీమ చిటుక్కుమన్నా అభిమానులకి ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ ముంబై నగరంలోని నానావతి ఆసుపత్రిలో చేరారు.లివర్ సమస్య  కారణంగా మూడు రోజులుగా ఆకయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నానావతి హాస్పిటల్‌లో ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 11న బిగ్ బి తన  77 వ పుట్టినరోజును తన కుటుంబం మరియు సన్నిహితులతో జరుపుకున్నారు.

బిగ్ బి హాస్పిటల్‌లో చేరినట్టు తెలిసిన వెంటనే ఆయన ఆరోగ్యంపై పలువురు ఆరా తీస్తున్నారు. దీనిపై హాస్పిటల్ వైద్యులుస్పందిస్తూ  రెగ్యూలర్ చెకింగ్‌లో భాగంగానే అమితాబ్ వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని  చెప్పారు. దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక గదిలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా తాజాగా ‘కార్వా చౌత్’ పండుగ సందర్భంగా బచ్చన్ తన అభిమానులను పలకరించారు.

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి కి ఐస్ తో ‘77' తో శుభాకాంక్షలు...!
బిగ్ బి కి ఐస్ తో ‘77' తో శుభాకాంక్షలు...!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.