(Local) Sat, 24 Jul, 2021

హీరోయిన్‌పై అరెస్ట్ వారెంట్...

October 15, 2019,   2:19 PM IST
Share on:
హీరోయిన్‌పై అరెస్ట్ వారెంట్...

అమీషా పటేల్ పేరు కి బాలీవుడ్ భామ అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షుకులకి దెగ్గరయింది. తాజాగా ఈ గుజరాతీ భామ పై చెక్ బౌన్స్ కేసు పెట్టడంతో ఆమె ఇబ్బందుల్లో పడింది. 'దేశీ మ్యాజిక్' అనే సినిమా నిర్మించడానికి అమీషా పటేల్ ఆమె భాగస్వామి తన నుండి 2.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని అజయ్ కుమార్ చెప్పారు. కానీ వాళ్ళు ఆ చిత్రం చేయలేదని తన డబ్బులు తిరిగి అడిగితే అమీషా పటేల్ చెక్ ఇచ్చిందని అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యిందని ఆయన ఆరోపించాడు. అమీషా పటేల్ ని మరలా తన డబ్బులు ఇవ్వాలని కోరగా ఆమె తన మనుషులతో బెదిరించిందని ఆయన వాపోయాడు. దీంతో ఆయన రాంచి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయంపై అమీషా పటేల్ ట్విట్టర్ లో స్పందించింది. నిర్మాత అజయ్ కుమార్ తనను అప్రతిష్ఠపాలు చేయడానికే ఈ కేసు పెట్టారని ఆమె ఆరోపించింది. ప్రజలలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి పేరు పొందాలని అజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపింది. దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పింది.

తెలుగులో పవన్ కళ్యాణ్‌కు జోడీగా ‘బద్రి’, మహేష్ బాబుకు జోడీగా ‘నాని’, ఎన్టీఆర్‌కు జంటగా ‘నరసింహుడు’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమీషా పటేల్. ఆ తర్వాత అమీషా బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. అక్కడ కూడా చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 13లో అమీషా స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.