(Local) Thu, 24 Sep, 2020

ఊపిరితిత్తులు కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నా సూపర్ స్టార్....

August 23, 2019,   9:38 PM IST
Share on:
ఊపిరితిత్తులు కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నా సూ ...

ఒక సాధారణ వృక్షం 50 సంవత్సరాల జీవిత కాలంలో సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అమెజాన్ బేసిన్.. 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు ఆలవాలం.  భూతాపాన్ని నియంత్రించటానికి ఈ ప్రాంతం చాలా కీలకమైనది. ఎందుకంటే.. అమెజాన్ అడవులు ప్రతి ఏటా కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటాయి. దాదాపు 74 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న అమెజాన్ బేసిన్‌ ప్రధానంగా బ్రెజిల్‌లో ఉంది. ఆ దేశంలోని అమెజాన్‌ అడవుల్లో గత దశాబ్దం కాలంలోనే ఇప్పుడు చాలా అధికంగా, తీవ్రంగా మంటలు చెలరేగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వర్షాధార అడవులు అమెజాన్ అడవులు. భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు నిత్యం అంటుకుంటూనే ఉంటున్నాయి. బ్రెజిల్‌కు చెందిన ఆ అడ‌వులు ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతున్నాయి. ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీనిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు,శాస్త్ర‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు దీనిపై స్పందిస్తూ ఉన్నారు. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి..! ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్‌ని కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నారు. టాలీవుడ్ నుండి మొద‌ట మ‌హేష్ బాబు స్పందించారు. 

ఈ వార్త చాలా భాదాక‌రమైన‌ది. 20 శాతం ఆక్సీజ‌న్‌ని అందించే అమెజాన్ అడవులు మంట‌ల‌లో కాలిపోతున్నాయి. ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. జీవ వైవిధ్యం చాలా దెబ్బతింటుంది. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. పచ్చని వాతావ‌ర‌ణం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. అది మ‌న ఇంటి నుండి ప్రారంభిద్దాం! అని మ‌హేష్ పిలుపునిచ్చారు. సాయిధ‌ర‌మ్ తేజ్, అనుష్క శ‌ర్మ‌, అర్జున్ క‌పూర్, దిశా ప‌ఠానీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు అమెజాన్ అడ‌వుల‌ని కాపాడుకుందాం అని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్స్‌ని కోరారు.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.