(Local) Mon, 30 Nov, 2020

రీమేక్ కాంబో లో మళ్ళి స్క్రీన్ పంచుకోనున్న ఆ జంట.....?

August 12, 2019,   12:47 PM IST
Share on:
రీమేక్ కాంబో లో మళ్ళి స్క్రీన్ పంచుకోనున్న ఆ జంట.. ...

ఈ మధ్య తెలుగు సినిమాలు బాలీవుడ్ లోకి రీమేక్ అనే పేరుతో బాగా సాగుతున్నాయి. ఆ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్ - మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ జెర్సీ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను తమిళంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. ఇందులో హీరో పాత్ర కోసం తమిళ నటుడు విష్ణు విశాల్‌ను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్‌ చేసిన పాత్రను తమిళంలో అమలాపాల్‌ చేయనున్నట్లు ప్రస్తుతం కోలివుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ జెర్సీ తమిళ రీమేక్‌లో కనుక అమలాపాల్‌ నటిస్తే… విష్ణు విశాల్‌, అమలాపాల్‌ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా అవుతుంది. ఇప్పటికే ఈ జంట కోలీవుడ్‌లో విజయం సాధించిన రాక్షసన్‌ సినిమాలో కలిసి నటించారు. ఇక జెర్సీ తమిళ రీమేక్‌ను నిర్మించేందుకు రానా దగ్గుబాటి ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వర్గం
మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు
మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.