(Local) Sun, 20 Jun, 2021

‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ రిలీజ్ చేసిన చిన్నారులు....

November 14, 2019,   2:18 PM IST
Share on:
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ రిలీజ్ చేసిన చిన్నారులు....

గీతా ఆర్ట్స్, హారిక హాసిని బ్యానర్ల పై అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా స్టైలిష్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం '‘అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రం కోసం అల్లు, త్రివిక్రమ్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారు.....నిన్న చిత్రబృందం ఈ మూవీలో నుండి థర్డ్ సాంగ్ ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్  చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే ఈ పాటకు సంబంధించిన టీజర్ వచ్చేసింది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మైగాడ్ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేసింది మూవీ టీమ్..ముందుగా ఈ పాటను ఇద్దరు గెస్ట్‌లు రిలీజ్ చేస్తారనుకున్నారు కట్ చేస్తే టీజర్‌లో బన్నీ కుమార్తె, కుమారుడు కనిపించి సర్‌ప్రైజ్ చేశారు.. ఈ సినిమా కోసం అల్లు అయాన్, అల్లు అర్హ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చారు. ఈ పాట టీజర్‌ను బన్నీ కొడుకు,కూతురు స్టెప్పులు వేస్తుండగా వీడియో తీసి రిలీజ్ చేశారు. అయాన్, అర్హ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అయాన్ వేసిన చిటుకు పుటుకు స్టెప్స్ భలే ఉన్నాయి..ఇది చూసిన వారంతా చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు తమన్‌ ట్యూన్ కంపోజ్ చేయగా, కృష్ణ చైతన్య లిరిక్స్ రాశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘ఓ మైగాడ్‌ డాడీ’ అంటూ సాగే పూర్తి పాట ఈ నెల 22న విడుదల చేయనున్నారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్‌ప్ ...
‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్‌ప్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.