(Local) Sat, 24 Jul, 2021

‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్‌ప్రైజ్

November 13, 2019,   5:47 PM IST
Share on:
‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్‌ప్ ...

గీతా ఆర్ట్స్, హారిక హాసిని బ్యానర్ల పై అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్, సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి మరో అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం నుండి మూడో పాట విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

రేపు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఉదయం 10 గంటలకు ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘ఓఎంజీ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరో విశేషం ఏంటంటే ఈ పాటను ఇద్దరు స్పెషల్ గెస్ట్‌లు రిలీజ్ చేయనున్నారట.అయితే ఆ అతిథులు ఎవరు అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే మరి. ఇప్పటికే రెండు పాటలతో రచ్చ లేపిన థమన్.. మూడో పాట ఎలా కంపోజ్ చేసుంటాడా అని బన్నీ ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ ‘అల వైకుంఠపురములో’ మూవీ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.

సంబంధిత వర్గం
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ...
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.