(Local) Sun, 25 Jul, 2021

బీహార్ వరద బాధితులకు స్టార్ హీరో విరాళం....

October 29, 2019,   6:17 PM IST
Share on:
బీహార్ వరద బాధితులకు స్టార్ హీరో విరాళం....

ఈ హీరో పేరు చెప్పగానే అందరికి యాక్షన్ హీరో అనే కాకుండా రియల్ హీరో అని కూడా చెబుతుంటారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా....బాలీవుడ్ స్టార్ హీరో కిలాడీ...ఈ హీరో మరోసారి మనసున్న మారాజు అని నిరూపించుకున్నాడు. అక్షయ్ ఇప్పటికే పలుమార్లు తన దాతృత్వాన్ని చాటుకున్న సంఘటనలు ఎన్నో... బీహార్ వరద బాధితులకు తన వంతు సహాయం అందించారు.. కొంతకాలం క్రితం అసోం వరద బాధితులకు రెండు కోట్ల రూపాయల సాయం అందించిన అక్షయ్.. బీహార్ వరద బాధితులకు చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1కోటి రూపాయల చెక్‌ను అందచేశారు అక్షయ్. ఆయన ప్రకటించిన కోటి రూపాయల మొత్తంతో, కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున 25 బాధిత కుటుంబాలకు సాయం అందనుంది. ఛట్ పూజ సందర్బంగా అక్షయ్ ఈ కుటుంబాలకు నాలుగేసి లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నారు. బీహార్ వరదల కారణంగా కొన్ని లక్షలమంది నిరాశ్రయులయ్యారు. వారికి ఉపాధి కరువయ్యింది. కనీసం తిండి కూడా అందక విలవిల్లాడిపోయారు. ఈ నేపధ్యంలో సీఎం రూ. 136.58 కోట్ల మొత్తాన్ని బాధితులను ఆదుకునేందుకు అందించారు. పకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు బాధితులను ఆదుకోవడాని మరింతమంది ముందుకు రావాలని అక్షయ్ పిలుపునిచ్చారు.

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
హాట్‌ సిల్వర్‌ ఔట్‌ ఫిట్ లో మ‌లైకా...బర్త్ డే
హాట్‌ సిల్వర్‌ ఔట్‌ ఫిట్ లో మ‌లైకా...బర్త్ డే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.