(Local) Fri, 23 Jul, 2021

సరికొత్తగా ప్రమేషన్స్ నిర్వహించిన హౌస్ ఫుల్ 4....!!

October 18, 2019,   3:21 PM IST
Share on:
సరికొత్తగా  ప్రమేషన్స్ నిర్వహించిన హౌస్ ఫుల్ 4.... ...

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన నటించే సినిమాల్లోనే వైవిధ్యం చూపించడమే కాకుండా....తన లేటెస్ట్ మూవీకి ప్రమేషన్స్ కూడా డిఫరెంట్ గా కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకొస్తు తన మార్కును క్రియాట్ చేస్తుంటాడు. తాజాగా అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ హీరోలుగా, దగ్గుబాటి రానా విల్లన్ గా, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ ‘హౌజ్ ఫుల్ 4’. ఈ మూవీకి  ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డిఫరెంట్ గా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కోసం వీరు ఇండియ‌న్ రైల్వేస్ స‌హ‌కారంతో ఓ ల‌గ్జ‌రీ రైలును రెంటుకు తీసుకున్నారు. అందులో భాగంగా.. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 'హౌస్‌ఫుల్ 4' ఎక్స్‌ప్రెస్ అనే కొత్త రైలును ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రైలులో నటీనటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి 'ప్రమోషన్స్ ఆన్ వీల్స్' అనే పేరు  పెట్టారు. కాగా ముంబయి నుంచి దిల్లీ వెళ్లే రైలులో హౌస్‌ఫుల్ 4 చిత్రబృందం ప్రయాణించింది. 'హౌస్‌ఫుల్ 4' టీం దిల్లీ నుంచి ముంబయి వరకు ఈ రైలులో ప్రయాణించింది. తిరిగి మళ్లీ ముంబయి నుంచి దిల్లీకి తిరిగి ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేసిన వీడియోను అక్షయ్, పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఈ స్కీంను వాడుకున్న తొలి చిత్రబృందం 'హౌస్‌ఫుల్ 4' కావడం విశేషం.

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
హౌస్ఫుల్ 4: భూత్ సాంగ్ విడుదలైంది..
హౌస్ఫుల్ 4: భూత్ సాంగ్ విడుదలైంది..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.