(Local) Fri, 07 May, 2021

“హౌజ్‌ఫుల్-4” లో అక్కి లుక్....

September 25, 2019,   5:07 PM IST
Share on:
“హౌజ్‌ఫుల్-4” లో అక్కి లుక్....

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా “హౌజ్‌ఫుల్-4” చిత్రం చేస్తున్న సంగ‌తి విదితమే. తాజాగా అక్షయ్ పాత్ర‌కి సంబంధించిన లుక్స్ విడుద‌ల‌య్యాయి. ఇందులో అక్ష‌య్ లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. సెప్టెంబ‌ర్ 27న చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కానుండ‌గా, దీపావ‌ళికి మూవీని రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. 2019 నుండి 1419కి ఈ చిత్రం తీసుకెళుతుంద‌ని అక్ష‌య్ అంటున్నారు. ఈ చిత్రాన్ని మొద‌ట సాజిద్ ఖాన్ తెర‌కెక్కించ‌గా ఆయ‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌ల వ‌ల‌న ఆయ‌న స్థానంలో ఫ‌హ‌ద్ సంజీని ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. ఇక నానా ప‌టేక‌ర్ స్థానంలోపై కూడా లైంగిక ఆరోప‌ణ‌లు రాగా ఆయ‌న స్థానంలో రానాని తీసుకున్నారు. కృతి స‌నన్, రితేష్ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే, బాబి డియోల్‌, కృతి క‌ర్భందా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రంలో అక్ష‌య్ కుమార్ బాలా మ‌రియు హ‌ర్రి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు.
 

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.