(Local) Wed, 20 Oct, 2021

శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్...

November 14, 2019,   5:13 PM IST
Share on:
శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్...

వెండితెరపై నటించిన నటులకి ఎంత ఆదరణ లభిస్తుందో...అదే విధంగా వారి నటనను ప్రశంసిస్తు అవార్డ్స్ అందుకోవడం అనేది ఎంతో విశిష్టమైనది అని చెప్పవచ్చు. కాగా చిత్రసీమలో ప్రతిభావంతులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను గురువారం ప్రకటించారు. 2018-19కిగాను దివంగత నటి శ్రీదేవి, ప్రముఖ నటి రేఖలను ఎంపిక చేశారు. శ్రీదేవిని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ఇది రెండోసారి. 2013లో ఆమె జీవించి ఉన్నప్పుడు ఈ అవార్డును అందుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా మరణానంతరం మరోసారి ప్రకటించారు. 
ఈ నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోలో శ్రీదేవి తరఫున భర్త బోనీకపూర్, రేఖలు అవార్డు మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకుంటారు. అన్నపూర్ణ కాలేజీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ మీడియా (ఏసీఎఫ్‌ఎం) తృతీయ స్నాతకోత్సవం కూడా ఆ రోజే జరుగుతుందని కమిటీ తెలిపింది. శ్రీదేవి దక్షిణాది చిత్రాల్లో ఒక వెలుగు వెలిగి బాలీవుడ్ కు వెళ్లడం తెలిసిందే. రేఖ కూడా తెలుగు నుంచి టీనేజ్ వయసులోనే బాలీవుడ్‌లోకి వెళ్లి సత్తా చారు.  ఏఎన్‌ఆర్‌ అవార్డులను ఇదివరకు అందుకున్నవారిలో దేవానంద్‌, రాజమౌళి, అంజలీదేవి, వైజయంతిమాల,  లతా మంగేష్కర్, బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనగల్, అమితాబ్‌బచ్చన్‌ కృష్ణ ఉన్నారు.

సంబంధిత వర్గం
‘అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది…రేఖ
‘అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది…రేఖ
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.