(Local) Fri, 26 Feb, 2021

అజయ్‌ దేవ్‌గణ్‌ సమర్పణలో అభిషేక్‌ - ఇలియానా....

August 08, 2019,   1:21 PM IST
Share on:
అజయ్‌ దేవ్‌గణ్‌ సమర్పణలో అభిషేక్‌ - ఇలియానా....

2012లో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బోల్‌ బచ్చన్‌’ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌ - అజయ్‌ దేవ్‌గణ్‌ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్ళి ఇదే హీరోల కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కపోతోంది అని సమాచారం. ఈ చిత్రంలో ఇలియానా కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతోందట. 1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ మూవీకి దర్శకుడిగా కుకీ గులాటీ వ్యవహరించనున్నారు. ఈయన 'టోటల్‌ ఢమాల్‌' చిత్రానికి క్రియేటివ్‌ దర్శకుడిగా పని చేశారు. ఈ చిత్రాన్ని అజయ్‌ దేవగన్‌ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇలియనా అభిషేక్‌కు జోడీ కాదు కానీ ఈ చిత్రానికి ఈమె పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అభిషేక్‌ జోడీగా మరో కథానాయిక చేయబోతుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్రీకరణను ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో అజయ్‌ దేవగన్‌ నటిస్తారా? లేదా? అన్నది మాత్రం ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌ అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌లో నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌ 'భుజ్‌ : ది పైడ్‌ ఆఫ్‌ ఇండియా' పనుల్లో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా చాణక్య, 'తంహజి : ది అన్‌ సంగ్‌ వారియర్‌' వంటి చిత్రాలు కూడా అజయ్‌ చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.