(Local) Thu, 24 Sep, 2020

బ‌చ్చ‌న్ ఫ్యామిలిలో ర‌క్షా బంధ‌న్‌ వేడుక....

August 16, 2019,   1:33 PM IST
Share on:
బ‌చ్చ‌న్ ఫ్యామిలిలో ర‌క్షా బంధ‌న్‌ వేడుక....

శ్రావణమాసంలో శ్రావణ పౌర్ణమి రోజు అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ రాఖీ పౌర్ణమి.  అన్నా చెల్లెల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌న్ వేడుకలు దేశ‌మంత‌టా ఘ‌నంగా జ‌రిగాయి. సోదరీమ‌ణులు త‌మ సోద‌రుల‌కి రాఖీలు క‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు. సెల‌బ్రిటీలు కూడా ఈ వేడుకని ఎంతో ఉత్సాహంతో జ‌రుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి వైర‌ల్‌గా మారాయి. ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ త‌న పుట్టినింటితో పాటు మెట్టినింటితో జ‌రుపుకున్న రాఖీ వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. కొంత కాలంగా సినిమాల‌కి దూరంగా ఉన్న ఐష్ త్వ‌ర‌లో మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. 

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.