(Local) Wed, 21 Aug, 2019

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి....?

August 05, 2019,   2:55 PM IST
Share on:

కండల వీరుడి సల్మాన్ ఖాన్ పెళ్లి విషయం మీద బాలీవుడ్ లో ఎప్పుడు ఎదో ఒక హాట్ టాపిక్ నడుస్తుందని తెలిసిందే. అయితే అదే కోవలో టాలీవుడ్ లో కూడా ఓ హీరో పెళ్లి మీద రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఆ హీరో ఎవరో కాదు... టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. అప్పుడెప్పుడో వర్షం సినిమాతో హీరోయిన్ త్రిషతో స్టార్ట్ అయినా పెళ్లి టాపిక్ ఇప్పటి బాహుబలి అనుష్క వరకు కొనసాగుతూనే......ఉంది. తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి టాపిక్ హాట్ గా మారింది. మిర్చి, బాహుబలి సినిమాల టైములో అనుష్క తో ఎంగేజ్మెంట్ అయిందని తర్వలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం మెగా డాటర్ నిహారికతో కూడా ప్రభాస్ వివాహం ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఇరువర్గాలు ఖండిస్తూ వచ్చాయి. తాజాగా ప్రభాస్  40వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అతని పెళ్లిపై మళ్లీ వార్తలు షికారు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ అమెరికాకు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో వ్యాపారంలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో ప్రభాస్ వివాహం జరగనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ప్రభాస్ స్పందించాల్సి అవసరం ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం హీరోగా నటించిన సాహో చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత వర్గం

స్టార్ హీరోస్ కలిసి ఒక ఫ్రేమ్ లో.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.